ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని నటించిన లేటెస్ట్ చిత్రం ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ నేడు ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అయింది. ఈ సినిమాను దర్శకుడు మహేష్ బాబు పి డైరెక్ట్ చేయగా పూర్తి రొమాంటిక్ కామెడీ డ్రామాగా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇక ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూలు రావడం, మౌత్ టాక్ బాగుండటంతో ఈ చిత్రాన్ని చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కట్టారు.
ఈ సినిమా టికెట్ బుకింగ్స్ చూస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. ప్రముఖ టికెట్ బుకింగ్ పోర్టల్ బుక్ మై షోలో ఈ సినిమాకు గంటకు 6500 టికెట్లు బుక్ అయ్యాయి. ఇక చాలా చోట్ల ఈ సినిమా హౌజ్‌ఫుల్ బోర్డులతో ప్రదర్శితమవుతుంది.
దీంతో ఈ సినిమా రానున్న రోజుల్లో మరింత రెస్పాన్స్‌తో దూసుకుపోవడం ఖాయమని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఓ హీరో అభిమాని కథగా తెరకెక్కిన ఈ సినిమాలో రామ్ పర్ఫార్మెన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. భాగ్యశ్రీ బొర్సె హీరోయిన్గా నటించిన ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేశారు.
