విడుదల తేదీ : నవంబర్ 27, 2025
స్ట్రీమింగ్ వేదిక : నెట్‌ఫ్లిక్స్
123తెలుగు.కామ్ రేటింగ్ : 3.25/5
నటీనటులు : మిల్లీ బాబీ, నోవాః స్క్నాప్, జేమీ కాంప్ బెల్ బోవెర్ ,ఫిన్ వోల్ఫ్ హార్డ్, డేవిడ్ హార్బర్, గెటెన్ మటరాజో, కాలెబ్ మెక్లాంగ్లిన్, జో కెరీ, తదితరులు
దర్శకులు : ది డఫర్ బ్రదర్స్ (షాన్ లెవీ, ఫ్రాంక్ డరాబోంట్)
నిర్మాత : హీలేరి లేవిట్
సంగీతం : కైల్ డిక్సన్, మైఖేల్ స్టైన్
సినిమాటోగ్రఫీ : కాలెబ్ హేయ్ మాన్
ఎడిటింగ్ : డీన్ జిమ్మర్ మ్యాన్, కేథరైన్ నరెంజో
సంబంధిత లింక్స్ : ట్రైలర్
ప్రపంచ ఓటిటి ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఆ బిగ్ డే ఇప్పుడు రానే వచ్చింది. సెన్సేషనల్ హిట్ అయ్యిన స్ట్రేంజర్ థింగ్స్ కి సీజన్ 5 అందులో మొదటి వాల్యూమ్ గా మేకర్స్ తొలి 5 ఎపిసోడ్స్ ని ఇప్పుడు వదిలారు. మరి పీక్స్ అంచనాలు ఉన్న ఈ సీజన్ తాలూకా నాలుగు ఎపిసోడ్స్ ఆ అంచనాలు అందుకుందా లేదా అనేది ఈ సమీక్షలో చూద్దాం.
కథ:
నాల్గవ సీజన్ ఎండింగ్ లో హాకిన్స్ నగరంలో వెక్నా (జేమీ కాంప్ బెల్ బోవెర్) చేసిన విధ్వంసం నుంచి యూఎస్ ప్రభుత్వం, మిలట్రీ సంస్థ యాక్సిస్ కంట్రోల్ సరిహద్దులు స్వాధీనం చేసుకొని ఓ ల్యాబ్ లో కొన్ని ప్రమాదకర ప్రయోగాలు చేస్తుంటారు. ఇంకో పక్క నాన్సీ (నటాలియా డైయర్), మైక్ (ఫిన్ వోల్ఫ్ హార్డ్) కుటుంబంతో విల్ (నోవాః స్క్నాప్) కుటుంబం ఉంటారు. అయితే నాన్సీ చెల్లెలు హాలీ వీలర్ (నెల్ ఫీలర్), గత సీజన్ విలన్ వెక్నాకి మరో రూపం అయ్యిన హెన్రీ చేత ట్రాప్ చేయబడుతుంది. అయితే ఆమె మాత్రమే కాకుండా ఇంకా చాలా మంది పిల్లలు వెక్నా చేత బాధించబడతారు. ఈ క్రమంలో ఎలెవన్/ జేన్ (మిల్లీ బాబీ) తన తండ్రి జిమ్ హాపర్ (డేవిడ్ హార్బర్) తో వెక్నాని ఎదుర్కోవడానికి ట్రైనింగ్ అవుతుంది. అలానే విల్ కూడా వెక్నా చేత బాధించడం కొనసాగుతుంది. ఇంకోపక్క ఇతర ఫ్రెండ్స్ డస్టిన్ (గెటెన్ మటరాజో), లూకస్ (కాలెబ్ మెక్లాంగ్లిన్), స్టీవ్ హారింగ్ టన్ (జో కెరీ) లు వెక్నాని అంతం చేయడానికి అప్ సైడ్ డౌన్ ప్రపంచంలోకి వెళ్ళడానికి ట్రై చేస్తారు. ఇలా అంతిమంగా వెక్నాని ఆపే ప్రయత్నంలో విల్ కి ఏమైంది? ఎల్ కి దొరికిన సహకారం ఏంటి? వెక్నాని ఆపేందుకు ఏర్పడ్డ పరిస్థితులు ఎలా సాగాయి అనేది తెలియాలి అంటే ఈ నాలుగు ఎపిసోడ్స్ చూస్తే తెలుస్తుంది.
ప్లస్ పాయింట్స్:
ఈ స్ట్రేంజర్ థింగ్స్ సిరీస్ కోసం మినిమమ్ ఐడియా ఉన్న ఫ్యాన్స్ ని అయినా ఈ సిరీస్ కేవలం ఈ నాలుగు ఎపిసోడ్ల సీజన్ సాలిడ్ ట్రీట్ తో ఆకట్టుకుంటుంది. మంచి హైప్ నడుమ వచ్చిన ఈ సీజన్ కూడా మంచి ఎంగేజింగ్ మూమెంట్స్ తో ఫ్యాన్స్ కి థ్రిల్ ఇచ్చేలా అక్కడక్కడా సాలిడ్ హై మూమెంట్స్ తో సాగుతూ వెళుతుంది. మొదటి ఎపిసోడ్ పూర్తయ్యాక రెండో ఎపిసోడ్ నుంచి ఈ వాల్యూమ్ మంచి మూమెంట్ లో సాగుతుంది అని చెప్పాలి.
ఈ మొత్తం సిరీస్ లో కీలకమైన ఎమోషన్స్ అలాగే ఫ్రెండ్షిప్ పార్ట్ లాంటివి ఇందులో కూడా ఇంప్రెస్ చేసే విధంగా ఈ సిరీస్ ఫ్యాన్స్ కి మరింత కనెక్ట్ అయ్యేలా కనిపిస్తాయి. అలాగే ఒకో పాత్రని బిల్డ్ చేస్తూ తీసుకెళ్లిన కథనం కూడా ఇందులో ఇంప్రెస్ చేస్తుంది. ఒక కట్ నుంచి మరొక కట్ కి జరిగే ట్రాన్సిక్షన్స్ మంచి యాక్షన్ ఎపిసోడ్స్ ఇందులో మెప్పిస్తాయి.
అలాగే విల్ ఎందుకు బాధించబడుతున్నాడు దాని వెనుక ఉన్న కారణం ఇందులో అర్ధవంతంగా కనిపిస్తుంది. ఇక ఈ వాల్యూమ్ లాస్ట్ ఎపిసోడ్ మాత్రం పెద్ద ఫీస్ట్ అని చెప్పవచ్చు. ఒక మ్యాడ్ ఎక్స్ పీరియెన్స్ ని ఈ నాలుగు ఎపిసోడ్స్ లో ఇది అందిస్తుంది. మెయిన్ గా ఇందులో క్లైమాక్స్ పోర్షన్ అయితే ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ ఇచ్చినా ఆశ్చర్యం లేదు.
డెఫినెట్ గా ఈ సిరీస్ ఫ్యాన్స్ ఏం కోరుకుంటున్నారో ఆ ఎమోషన్ ని తీసుకెళ్లి నెక్స్ట్ రానున్న మిగతా ఎపిసోడ్స్ కోసం మరింత ఎగ్జైటింగ్ గా ఎదురు చూసే మూమెంట్ ఇది కదా అనిపించే రీతిలో ఎండ్ అవుతుంది. అలానే కొన్ని ట్విస్ట్ లు కూడా ఇందులో బాగున్నాయి. ఇక ఈ సీజన్ లో కూడా ప్రతీ ఒక్క మెయిన్ నటీనటులు మంచి పెర్ఫామెన్స్ లు కనబరిచారు.
ఎల్ ఫ్యాన్స్ అయితే ఆమెలోని ఇనోసెన్స్ మరోసారి ఫీల్ అవుతారు. డస్టిన్ (గెటెన్ మటరాజో) ఎంట్రీ తన యాటిట్యూడ్ లు తన రోల్ ని ఇష్టపడేవారికి నచ్చుతాయి. లూకస్ (కాలెబ్ మెక్లాంగ్లిన్) తన రోల్ లో బాగా చేసాడు. స్టీవ్ హారింగ్ టన్ (జో కెరీ) కి కూడా మంచి ఫ్యాన్స్ ఉన్నారు. తనపై అప్ సైడ్ డౌన్ పోర్టల్ గేట్ లోకి వెళ్లిన సీక్వెన్స్ సాలిడ్ గా ఉంటుంది. ఇలా అందరు ప్రధాన నటులు ఇందులో సాలిడ్ పెర్ఫామెన్స్ లు అందించారు.
మైనస్ పాయింట్స్:
జెనరల్ గా స్ట్రేంజర్ థింగ్స్ నాలుగు సీజన్స్ ని ఇష్టపడ్డవారికి అసలు నిడివి అనేది సమస్యే కాదు అంటారు. గంటకి పైగానే ఉండే ఎపిసోడ్స్ అయినప్పటికీ అప్పుడే అయిపోయిందా అనే ఫీల్ ని గత సీజన్స్ కలిగించాయి. ఈసారి కూడా పెద్ద లెంగ్త్ తోనే ఎపిసోడ్స్ వచ్చాయి. కానీ ఈసారి మాత్రం కొంచెం అక్కడక్కడా కథనం స్లో అనిపిస్తుంది. అయితే ఇది ఒకో పరిస్థితిని బిల్డ్ చేసేందుకే వెళ్లినప్పటికీ అందరికీ ఆ ఫ్లో నచ్చుతుంది అని చెప్పలేం.
అలాగే ఎందులో ఈసారి వి ఎఫ్ ఎక్స్ వర్క్స్ కొన్ని చోట్ల అంత నాచురల్ గా కనిపించలేదు. అక్కడక్కడా వీక్ విజువల్స్ కనిపించాయి. అలాగే ఇంకొన్ని సీన్స్ ని జెనరల్ ఆడియెన్స్ కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇంకా మెయిన్ అంశం ఏంటంటే కొత్తగా ట్రై చేసేవారు అయితే మరింత కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో దీని పుట్టు పూర్వోత్తరాలు తెలుసుకోకుండా చూస్తే మరింత బోర్ ఫీల్ అవుతారు.
సాంకేతిక విభాగం:
ఈసారి కూడా ప్యాకెడ్ ప్రొడక్షన్ వాల్యూస్ తో ఈ సీజన్ ని మేకర్స్ ప్లాన్ చేశారు. టోటల్ సెటప్, ప్రొడక్షన్ డిజైన్ పరంగా ఎక్కడా వెనకాడలేదు కానీ ఆ గ్రాఫిక్స్ విషయంలో ఇంకొంచెం కేర్ తీసుకోవాల్సింది. అది కూడా కొన్ని కొన్ని షాట్స్ లో మాత్రమే. ఇక కాలెబ్ హేయ్ మాన్ సాలిడ్ కెమెరా వర్క్ అందించారు. అలాగే కైల్ డిక్సన్, మైఖేల్ స్టైన్ ల సంగీతం బాగుంది. సీన్స్ లో టెంపోని బాగా మైంటైన్ చేస్తూ ఇంప్రెసివ్ వర్క్ అందించారు. డీన్ జిమ్మర్ మ్యాన్, కేథరైన్ నరెంజో ల ఎడిటింగ్ డీసెంట్ గా ఉంది.
ఇక దర్శకులు ది డఫర్ బ్రదర్స్ (షాన్ లెవీ, ఫ్రాంక్ డరాబోంట్) లు మంచి వర్క్ ఈ సీజన్ కి అందించారు. ఒకో ఎపిసోడ్ ని బిల్డ్ చేస్తూ నాలుగో ఎపిసోడ్ కి కావాల్సినంత హైప్ ని సెట్ చేసి పెట్టడం బాగుంది. అయితే ఇలాంటి హై మూమెంట్స్ ని గత సీజన్స్ లో ఎపిసోడ్స్ తరహాలో కూడా ఒకో ఎపిసోడ్ కి పెట్టి ఉంటే ఫ్యాన్స్ కి మరింత నచ్చి ఉండేది. అయినప్పటికీ తమ వర్క్ ఈ నాలుగు ఎపిసోడ్స్ లో బాగుంది.
తీర్పు:
ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ స్ట్రేంజర్ థింగ్స్: సీజన్ 5 – వాల్యూమ్ 1 లోని నాలుగు ఎపిసోడ్స్ కలయిక ఈ సిరీస్ ఫ్యాన్స్ కి మంచి ట్రీట్ అని చెప్పవచ్చు. లీడ్ నటీనటులు అంతా మంచి పెర్ఫామెన్స్ లు అందించారు. అలాగే ఒకో ఎపిసోడ్ తర్వాత మంచి థ్రిల్లింగ్ గా ఆసక్తికరంగా సాగే కథనం, అందులోని ఎమోషన్, అడ్వెంచర్ రైడ్ ఫ్యాన్స్ ని మరింత ఉత్సాహపరుస్తాయి. ఇక వీటికి మించి నాలుగో ఎపిసోడ్ ఎండింగ్ నెక్స్ట్ లెవెల్లో వర్కౌట్ అయ్యింది. కాకపోతే కొన్ని ఫ్లాస్ అక్కడక్కడా అనిపిస్తాయి కానీ నాలుగో ఎపిసోడ్ చూసాక మాత్రం ఈ సిరీస్ ఫ్యాన్స్ నెక్స్ట్ రానున్న ఎపిసోడ్స్ కోసం అంచనాలు పెరిగిపోతాయి. అక్కడ నుంచి అసలు వార్ బాకీ ఉంది. సో ఈ సీజన్ ని వీకెండ్ కి ఓటిటిలో ఎంజాయ్ చేయవచ్చు.
123telugu.com Rating: 3.25/5
Reviewed by 123telugu Team
