‘దేవర’, ‘వీరమల్లు’ కథ ఎటు వెళ్తున్నట్టు?

devara hhvm

టాలీవుడ్ నుంచి వచ్చిన గత ఏడాది బిగ్గెస్ట్ హిట్ చిత్రాల్లో మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన చిత్రం దేవర కూడా ఒకటి. మరి దేవర కథ తెలియాలి అంటూ.. మంచి బజ్ ఇప్పటికీ ఆడియెన్స్ లో ఈ సినిమా కోసం నానుతుంది.

కానీ పార్ట్ 2 విషయంలో మాత్రం కొన్ని రూమర్స్ అలా వినిపిస్తూనే ఉన్నాయి. ఆ మధ్య కాలంలో అంతా సినిమా ఆగినట్టు రూమర్స్ వచ్చాయి కానీ మేకర్స్ అలాంటిది ఏమీ లేదు అనే ఖండించారు. కానీ లేటెస్ట్ గా మన టాలీవుడ్ నుంచి ఓ భారీ సినిమా సీక్వెల్ నిలిచిపోయినట్టు మళ్ళీ రూమర్స్ మొదలయ్యాయి.

అయితే ఈసారి కూడా దేవర 2 కోసం వినిపించింది. అయితే అదే కాకుండా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు కూడా ఈ లిస్ట్ లో వినిపిస్తుంది. దీనితో ఈ రెండు సినిమాలు ప్రధానంగా ఈ టాక్ లో వినిపిస్తూ వస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది? ఏ సీక్వెల్ ఆగింది అనేది వేచి చూడక తప్పదు.

Exit mobile version