పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించనున్న పలు అవైటెడ్ చిత్రాల్లో దర్శకుడు సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్ లో చేస్తున్న సాలిడ్ యాక్షన్ చిత్రం ‘స్పిరిట్’ కూడా ఒకటి. భారీ హైప్ ని సెట్ చేసుకున్న ఈ సినిమా కోసం అభిమానులు ఓ రేంజ్ లో ఎగ్జైట్మెంట్ తో ఉన్నారు. అయితే ఈ సినిమా రీసెంట్ గానే లాంచ్ కూడా అయ్యింది. ఇక ఇక్కడ నుంచే పలు ఇంట్రెస్టింగ్ రూమర్స్ ఈ సినిమాపై మొదలయ్యాయి.
ఈ సినిమాలో ఒక మ్యాడ్ క్యామియో ఉంటుంది అని ఓ టాక్ తెగ వైరల్ అవుతుంది. అదేంటంటే సందీప్ వంగ అనిమల్ హీరో రణబీర్ కపూర్ కూడా కనిపిస్తాడని తెలుస్తుంది. ఇంకొందరు అయితే అనిమల్ కి స్పిరిట్ కి క్రాసోవర్ అని కూడా అంటున్నారు కానీ ఇవేవి ప్రస్తుతానికి నిజం కాదని వినిపిస్తుంది. ప్రభాస్ తో సందీప్ సెపరేట్ వరల్డ్ క్రియేట్ చేస్తున్నట్టుగా ఇపుడు టాక్. సో వీటిపై ఓ క్లారిటీని కాలమే అందించాలి.
