టాప్ ప్రొడక్షన్ హౌస్ తో అనీల్ రావిపూడి ఫిక్స్!

మన టాలీవుడ్ సినిమా దగ్గర వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ తో సాలిడ్ హిట్ ట్రాక్ రికార్డు పెట్టుకున్న దర్శకుల్లో అనీల్ రావిపూడి కూడా ఒకరు. మరి లేటెస్ట్ గా అనీల్ రావిపూడి మెగాస్టార్ చిరంజీవితో మన శంకర వరప్రసాద్ గారు అనే సినిమా చేస్తూ మరో హిట్ పై కన్నేసిన సంగతి తెలిసిందే. అయితే అనీల్ రావిపూడి లైనప్ పై మరో సాలిడ్ అప్డేట్ బయటకి వచ్చింది.

అనీల్ రావిపూడి ప్రస్తుతం సౌత్ లో బిగ్గెస్ట్ స్టార్స్ చిరంజీవి, యష్, విజయ్ లాంటి వారితో చేస్తున్న కే వి ఎన్ ప్రొడక్షన్స్ తో చేయనున్నట్టుగా ఇపుడు కన్ఫర్మ్ అయ్యింది. నేడు అనీల్ పుట్టినరోజు సందర్భంగా వారు తమ దర్శకునికి విష్ చేస్తున్నామని తెలిపారు. సో వారి బ్యానర్ లో కూడా అనీల్ నుంచి సినిమా పడుతుంది అని కన్ఫర్మ్ అయ్యింది. మరి అది ఏ హీరోతో అనేది ఇంకా రివీల్ కావాల్సి ఉంది. ఇదే నిర్మాణ సంస్థలోనే మెగాస్టార్, బాబీ కొల్లి కాంబినేషన్ సినిమా ఉన్న సంగతి తెలిసిందే.

Exit mobile version