వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ కి రాబోతున్న పలు అవైటెడ్ చిత్రాల్లో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు మారుతీ కాంబినేషన్ లో చేస్తున్న సాలిడ్ హారర్ ఎంటర్టైనర్ చిత్రం “ది రాజా సాబ్” కూడా ఒకటి. మంచి హైప్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్ నేడు గ్రాండ్ గా జరిగింది. అయితే ఇదే ఈవెంట్ లో బిగ్ న్యూస్ ని మేకర్స్ అందించారు.
ఈ సినిమాని జనవరి 9న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. కానీ అంతకు ముందే అంటే 8వ తేదీ అర్ధరాత్రి నుంచే పైడ్ ప్రీమియర్స్ ఉంటాయని కన్ఫర్మ్ చేశారు. సో ప్రభాస్ ఫ్యాన్స్ కి సంక్రాంతి జాతర ఒకింత ముందే స్టార్ట్ అయిపోతుంది అని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు మిరాయ్ చిత్రం తర్వాత మరింత గ్రాండ్ విజువల్స్ ని హాలీవుడ్ స్టాండర్డ్ లెవెల్స్ తో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు.
