2025లో ధనుష్ మూడో సినిమా.. తెలుగు రిలీజ్ డేట్ పోస్టర్ చూసారా?

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ హీరోగా నటించిన రెండు సినిమాలు ఆల్రెడీ ఈ ఏడాది రెండు వచ్చిన సంగతి తెలిసిందే. మరి ఈ చిత్రాల తర్వాత తన నుంచి మూడో సినిమా ఇప్పుడు రాబోతుంది. తాను బాలీవుడ్ లో చాలా కాలం తర్వాత హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రమే “తేరే ఇష్క్ మేన్”. దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్ తెరకెక్కించిన ఈ సినిమాలో ఆదిపురుష్ నటి కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది.

మరి ఈ సినిమా హిందీ, తెలుగు, తమిళ్ భాషల్లో కూడా ఫిక్స్ అయ్యింది. అయితే ఫైనల్ గా మేకర్స్ తెలుగు టైటిల్ ని రివీల్ చేశారు. ఈ సినిమా తెలుగులో ‘అమర కావ్యం’ పేరిట. రిలీజ్ కి రానున్నట్టు పోస్టర్ తో ఖరారు చేసారు. దీనితో ఈ నవంబర్ 28న పాన్ ఇండియా భాషల్లో ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కి సిద్ధం అయ్యింది. ఈ సినిమాకి పెద్ది సంగీత దర్శకుడు ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండడం విశేషం.

Exit mobile version