సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా ఇప్పుడు చేస్తున్న మరో అవైటెడ్ చిత్రమే జైలర్ 2. దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్ లో చేస్తున్న ఈ అవైటెడ్ సీక్వెల్ పట్ల తెలుగు, తమిళ ఆడియెన్స్ లో మంచి హైప్ ఉంది. అయితే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా ఫినిష్ అవుతుండగా ఈ సినిమా నుంచి సాలిడ్ టీజర్ రిలీజ్ పై ఇప్పుడు లేటెస్ట్ బజ్ వినిపిస్తుంది.
మరి దీని ప్రకారం మేకర్స్ ఈ డిసెంబర్ 12న టీజర్ ని రిలీజ్ చేస్తున్నట్టుగా టాక్. తమిళ సినీ వర్గాల్లో కూడా ఇదే టాక్ వినిపిస్తుంది. మరి ఆరోజున తలైవర్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఇక ఈసారి ఎలాంటి ట్రీట్ ని అందిస్తారో చూడాలి. ఆల్రెడీ అనౌన్సమెంట్ వీడియో తోనే నెక్స్ట్ లెవెల్ హైప్ ని సెట్ చేశారు. ఇక టీజర్ ఏ రేంజ్ లో ఉంటుందో చూడాల్సిందే. మరి ఈ సినిమాకి అనిరుద్ సంగీతం అందిస్తుండగా సన్ పిక్చర్స్ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.
