విడుదల తేదీ : నవంబర్ 21, 2025
స్ట్రీమింగ్ వేదిక : అమెజాన్ ప్రైమ్ వీడియో
123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5
నటీనటులు : మనోజ్ బాజ్పేయి, జైదీప్ అహ్లావత్, నిమ్రత్ కౌర్, ప్రియమణి, షరీబ్ హష్మీ, ఆశ్లేషా ఠాకూర్ మరియు ఇతరులు
దర్శకుడు : రాజ్ & డీకే, సుమన్ కుమార్, తుషార్ సేత్
నిర్మాత : రాజ్ & డికె
సంగీతం : సచిన్-జిగర్, కేతన్ సోధా
సినిమాటోగ్రఫీ : జే చరోలా
ఎడిటింగ్ : సుమీత్ కోటియన్
సంబంధిత లింక్స్ : ట్రైలర్
ఇండియన్ ఓటిటి ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న అవైటెడ్ వెబ్ సిరీస్ లలో ది ఫ్యామిలీ మ్యాన్ కూడా ఒకటి. దీనిలో మూడో సీజన్ ఇప్పుడు ఫైనల్ గా రిలీజ్ కి వచ్చింది. మరి ఈ సీజన్ ఎలా ఉంది? ఏ మేరకి ఆకట్టుకుంది అనేది సమీక్షలో చూద్దాం రండి.
కథ:
ఈసారి సీజన్ లో శాంతి భద్రతలు, డెవలప్మెంట్ కి కొంచెం దూరంగా ఉన్న ఉత్తర ఈశాన్య రాష్ట్రాలకి మంచి చేయాలని ప్రాజెక్ట్ సహకార్ అనే ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేయాలని చూస్తారు. కానీ ఆ ప్రాంతాల్లో ఒక డ్రగ్, ఆయుధాల మాఫియాకి చెందిన లీడర్ రుక్మ (జైదీప్ ఆహ్లావత్) చైనా సహకారంతో బాంబు దాడులు చేస్తాడు. అది అలా దేశ ప్రధాని వరకు వస్తుంది. ఈ నేపథ్యంలోనే శ్రీకాంత్ తివారి (మనోజ్ బాజ్ పాయి) తన గురువుగా భావించే ఎన్ ఐ ఏ చీఫ్ గౌతమ్ కులకర్ణి (దల్ప్ తాహిల్) ని ఓ అటాక్ లో కోల్పోతాడు. కానీ ఆ దాడిలో బ్రతికిన శ్రీకాంత్ వైపు ఎన్ ఐ ఏ అనుమానం మళ్లుతుంది. ఇలా ఊహించని విధంగా తన వైపు తిరిగిన తన అధికార యంత్రాంగం నుంచి శ్రీకాంత్ నిర్దోషిగా బయట పడతాడా లేదా? ఈసారి తన దేశం కోసం తాను ఏం చేసాడు? ఈ రుక్మ ఎవరు? తనకి జరిగిన నష్టం ఏంటి? అతనెందుకు శ్రీకాంత్ ని టార్గెట్ చేస్తాడు? ఇంకోపక్క శ్రీకాంత్ కి తానా ఫ్యామిలీలో ఉన్న పర్శనల్ గొడవల మధ్య ఇలాంటి క్లిష్ట పరిస్థితులు ఎలా నెట్టుకొచ్చాడు అనేది ఈ సీజన్ లో అసలు కథ.
ప్లస్ పాయింట్స్:
ఈసారి సీజన్ లో సృష్టించుకున్న వాతావరణం కూడా డీసెంట్ గా ఉంది. అయితే ఈసారి డ్రామా మరింత ఆసక్తికరంగా అనిపించడానికి కారణం ప్రధాన పాత్ర శ్రీకాంత్ తివారి రోల్ ని మరింత చిక్కుల్లో చూపించడం అని చెప్పాలి. ఒక పక్క తన దేశానికి తన విధేయత చూపించుకోవాలి మరోపక్క తన కుటుంబంలో నెలకొన్న ఉద్రిక్తకర పరిస్థితులు వాటి నుంచి తాను బయట పడేందుకు చేసిన జర్నీ ఈ సీజన్ లో ఈ సిరీస్ ఫ్యాన్స్ కి నచ్చుతుంది.
ఇక వీటితో పాటుగా యాక్షన్ ఎపిసోడ్స్ కూడా డీసెంట్ గా ఉన్నాయి. ఇక వీటితో పాటుగా కొన్ని మూమెంట్స్ ఎమోషనల్ పరంగా కూడా మొదటి నాలుగైదు ఎపిసోడ్స్ లో వర్కౌట్ అవుతాయి. అవి విలన్ సైడ్ ఉన్నప్పటికీ కూడా ఆడియెన్స్ ని కదిలిస్తాయని చెప్పొచ్చు. ఇక ఈసారి సీజన్ లో నటీనటుల ఎంపిక కూడా సాలిడ్ గా ఉందని చెప్పాలి.
ముఖ్యంగా పాతాళ లోక్ నటుడు జైదీప్ ఆహ్లావత్ ఈ సీజన్ లో సాలిడ్ పెర్ఫామెన్స్ ని అందించారు. మంచి విలనిజాన్ని చూపిస్తూ తన నెగిటివ్ పాత్రని బాగా చేశారు. అలాగే నటుడు మనోజ్ బాజ్ పాయి నుంచి మరో డీసెంట్ పెర్ఫామెన్స్ అని చెప్పాలి. అయితే ఈసారి గత సీజన్స్ లా కాకుండా తనలోని ఒక టెన్షన్ ని మైంటైన్ చేస్తూ నాచురల్ పెర్ఫామెన్స్ ని తాను అందించారు అని చెప్పాలి.
అలాగే తన సహా నటుడు జె కె తల్పడే నడుమ అక్కడక్కడా ఫన్ సీన్స్ బాగున్నాయి. అలాగే మరో నటి నిమ్రత్ కౌర్ నెగిటివ్ పాత్రలో నీట్ గా చేశారు. ఇక వీరితో పాటుగా తెలుగు నుంచి కూడా రాగ్ మయూర్ ఇంకా రవివర్మ లాంటి నటులు కనిపించడం తెలుగు ఆడియెన్స్ కి మరింత కనెక్ట్ అవుతుంది. రాగ్ మయూర్ పై ఓ కామెడీ సీన్ మంచి ఫన్ ని జెనరేట్ చేస్తుంది. ఇక వీరితో పాటుగా ప్రియమణి, ఇతర నటీనటులు తమ పాత్రల పరిధి మేరకు బాగా నటించారు.
మైనస్ పాయింట్స్:
ఈ సిరీస్ లో డిజప్పాయింట్ చేసే అంశాలు కూడా ఉన్నాయి మెయిన్ గా ఈ సిరీస్ తాలూకా ఫ్యాన్స్ అయితే ఇంకా డిజప్పాయింట్ అయ్యే ఛాన్స్ ఉంది. మొదటి రెండు సీజన్స్ లో కనిపించిన ఒక ఇంట్రెస్టింగ్ అండ్ గ్రిప్పింగ్ కథనం ఈ సిరీస్ లో మిస్ అయినట్టు అనిపిస్తుంది.
ఉన్నంతలో కొంతమేర సన్నివేశాలు ఫ్యామిలీ డ్రామా శ్రీకాంత్ తివారికి ఎదురయ్యే ఛాలెంజ్ లు డీసెంట్ గానే అనిపిస్తాయి. కానీ ఆ సీజన్స్ తాలూకా అంచనాలు రేంజ్ లో ఈసారి అనిపించలేదు. పైగా మూడేళ్ళ తర్వాత వస్తున్న సీజన్ కావడంతో అప్పుడు నుంచి ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి ఫుల్ ఫ్లెడ్జ్ గా ఈ సీజన్ ఎక్కకపోవచ్చు.
అలాగే స్లోగా నడిచే కథనం మరో డ్రా బ్యాక్ అని చెప్పాలి. అలా నెమ్మదిగా నడుస్తూ మరీ ఎగ్జైట్మెంట్ లు లేకుండా కథనం వెళ్లడం చూసే ఆడియెన్స్ లో అంత ఉత్సుకత తీసుకురాలేదు. మొత్తం 7 ఎపిసోడ్స్ లో మొదటి రెండు మూడు ఓకే పర్లేదు అనిపిస్తాయి. మళ్ళీ 6వ ఎపిసోడ్ నుంచి కొంచెం బెటర్ అనిపిస్తుంది. అంతే తప్ప మొత్తం అన్ని ఎపిసోడ్స్ కి ఒక సాలిడ్ ఎండింగ్, స్టార్ట్ లు లాంటివి ప్లాన్ చేసుకోలేదు.
సాంకేతిక వర్గం:
ఈ సిరీస్ లో నిర్మాణ విలువలు బాగున్నాయి. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ సీజన్ ని తెరకెక్కించారు. అలాగే టెక్నీకల్ గా కూడా ఈ సీజన్ బలంగా ఉంది. మంచి కెమెరా వర్క్ అలానే డీసెంట్ మ్యూజిక్ వర్క్స్ బాగున్నాయి. ఎడిటింగ్ ఇంకొంచెం బెటర్ గా ఉండాల్సింది. తెలుగు డబ్బింగ్ బాగుంది.
ఇక ఈ సీజన్ కి రాజ్ అండ్ డీకే లు మాత్రమే కాకుండా తుషర్ సెయ్త్ అలాగే సుమన్ కుమార్ లు కూడా దర్శకత్వం వహించారు. అయితే వీరి డైరెక్షన్ బాగానే ఉంది కానీ కథ, కథనాలు పట్ల మరింత శ్రద్ధ వహించాల్సింది. గత రెండు సీజన్స్ ని దృష్టిలో పెట్టుకొని ఇంకా బెటర్ లైన్ అండ్ సీన్స్ రాసుకుంటే బాగుండేది. శ్రీకాంత్ తివారి రోల్ చుట్టూ డ్రామా మాత్రం బాగా నడిపించారు.
తీర్పు:
ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ “ది ఫ్యామిలీ మ్యాన్ – సీజన్ 3” ఒక డీసెంట్ థ్రిల్లర్ అని చెప్పొచ్చు. గత రెండు సీజన్స్ తో పోలిస్తే మరీ క్లిష్టమైన లైన్ ఇందులో లేదు కానీ శ్రీకాంత్ తివారి అండ్ ఈ సిరీస్ ఫ్యాన్స్ వరకు ఈ సీజన్ బాగానే అనిపిస్తుంది. స్టార్ కాస్ట్ అంతా ఈ సిరీస్ లో మంచి నటన కనబరిచారు. ఎమోషన్స్, ఫన్, డ్రామా కొన్ని చోట్ల బాగున్నాయి. మరీ ఎక్కువ అంచనాలు పెట్టుకోకుండా ఈసారి సీజన్ ని ట్రై చేస్తే డీసెంట్ ట్రీట్ ఇస్తుంది.
123telugu.com Rating: 3/5
Reviewed by 123telugu Team
