ఓటీటీలో ‘డ్యూడ్’ హిట్.. కానీ ఫ్యాన్స్ మాత్రం ?

dude ott

ప్రదీప్ రంగనాథన్ తాజా హిట్ చిత్రం డ్యూడ్. దీపావళి కానుకగా వచ్చిన ఈ చిత్రం థియేటర్లలో సంచలనం సృష్టించింది. ఇప్పుడు అదే స్పందన ఓటీటీలో కూడా వస్తోంది. ఓటీటీలో ఈ సినిమాకి ఆదరణ బలంగా ఉండటంతో, నిర్మాతలు చాలా సంతోషంగా ఉన్నారు, కానీ అభిమానులు మాత్రం చిత్ర బృందానికి ఒక రిక్వెస్ట్ చేస్తున్నారు. ఈ సినిమా విజయంలో సంగీతం కీలక పాత్ర పోషించింది. అటు పాటలు కూడా సూపర్‌హిట్‌గా నిలిచాయి. దాంతో, ఈ చిత్రం యొక్క ఒరిజినల్ సౌండ్‌ట్రాక్ (OST)ని కూడా విడుదల చేయాలని సంగీత దర్శకుడు సాయి అభ్యాంకర్‌ను కొందరు ప్రేక్షకులు అభ్యర్థిస్తున్నారు.

కాగా రీసెంట్ గానే సాయి అభ్యాంకర్ కూడా తాను సౌండ్‌ట్రాక్ ని సైడ్ ఏ, సైడ్ బి అనే రెండు భాగాలుగా త్వరలో విడుదల చేస్తానని చెప్పాడు, అన్నట్టు ఈ సూపర్‌హిట్ చిత్రంలో మమితా బైజు (ప్రేమలు ఫేమ్) కథానాయికగా నటించింది. ఇక ఈ చిత్రం రెండవ వారంలోనే రూ. 100 కోట్ల గ్రాస్ మార్కును దాటిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాకి సాయి అభ్యంకర్ సంగీతం అందించాడు. అలాగే మైత్రి మూవీ మేకర్స్ మరో హిట్ గా కోలీవుడ్ లో అందుకున్నారు. తమిళ సీనియర్ హీరో ఆర్. శరత్‌కుమార్ ఆసక్తికరమైన పాత్రను పోషించగా, నేహా శెట్టి ఈ సినిమాలో అతిధి పాత్రలో కనిపించారు.

Exit mobile version