పెళ్లి చేసుకుని తప్పటడుగు వేశాను – జ్యోతి

నటి జ్యోతి బోల్డ్ క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా పేరు తెచ్చుకుంది. ఆ మధ్య తెలుగు బిగ్‌బాస్‌ మొదటి సీజన్‌లోనూ పాల్గొంది. ఐతే, తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో జ్యోతి తన కెరీర్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. నేను పుట్టింది ఒరిస్సాలో. కానీ, విశాఖపట్నంలోనే పెరిగాను. 24 ఏళ్లుగా హైదరాబాద్‌లో ఉంటున్నాను. మొదట్లో హీరోయిన్‌ అవుదామనే ట్రై చేశాను. కానీ, నాకు వ్యాంప్‌ తరహా పాత్రలే వచ్చాయి. నిజానికి ఇప్పటికీ ఐటమ్ సాంగ్స్‌ చేయమని అడుగుతున్నారు’ అని జ్యోతి తెలిపారు.

జ్యోతి తన పెళ్లి గురించి మాట్లాడుతూ.. ‘నా కెరీర్ లో పెళ్లి చేసుకుని తప్పు చేశాను. పైగా కెరీర్‌ బాగున్న దశలో పెళ్లి చేసుకున్నాను. అది నా లైఫ్ లో తప్పటడుగు వేశాను. అప్పట్లో ఒకబ్బాయిని ప్రేమించాను. వాడు నన్ను మోసం చేశాడు. ఆ కోపంలో నాకు ప్రపోజ్‌ చేసిన మరో అబ్బాయిని పెళ్లి చేసుకున్నాను. అదే నేను తీసుకున్న చెత్త నిర్ణయం. బాబు పుట్టిన రెండేళ్లకే మాకు విడాకులయ్యాయి. ఈ కాలం అమ్మాయిలకు ఓ విషయం చెప్పాలనుకుంటున్నాను. దయచేసి పెళ్లయినవాడి జోలికెళ్లకండి.. అంతకంటే దారుణం మరొకటి ఉండదు’ అని జ్యోతి చెప్పుకొచ్చింది.

Exit mobile version