‘వారణాసి’కి తగ్గ స్క్రీన్ లేదు.. దీనిపై జక్కన్న ఇంట్రెస్టింగ్ రిప్లై వైరల్!

varanasi

అత్యంత ఘనంగా అనౌన్స్ చేసిన లేటెస్ట్ భారీ చిత్రమే వారణాసి. దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు కలయికలో తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఇండియన్ సినిమా నుంచి రెండో ఐమ్యాక్స్ వెర్షన్ లో తెరకెక్కిస్తున్న సినిమా కాగా ఈ సినిమా అనౌన్సమెంట్ నే 100 అడుగుల భారీ తెరపై ఇచ్చి తమ సినిమా ఎక్స్ క్లూజివ్ గా ఐమ్యాక్స్ వెర్షన్ లో ఇలా ఉండబోతుంది అని రివీల్ చేశారు. సరే ఇదంతా బాగానే ఉంది కానీ ఇలాంటి ఒక సినిమాకి తగ్గ స్క్రీన్స్ సరైన సంఖ్యలో ఇండియాలో లేనే లేవు అని మూవీ లవర్స్ అంటున్నారు.

ఇక మన రెండు తెలుగు రాష్ట్రాల్లో అయితే ఒక్క ఐమ్యాక్స్ స్క్రీన్ కూడా లేదు. అలాగే 1.43 నిష్పత్తి కలిగిన స్క్రీన్ ఇండియా లోనే లేదు అనే దానిపై రాజమౌళి ఇంట్రెస్టింగ్ రిప్లై ఇచ్చారు. 2027 లో వారణాసి వచ్చే సరికి ఇండియాలో ఆ నిష్పత్తి కలిగిన స్క్రీన్ నా ల్యాండ్ హైదరాబాద్ లో ఒక ఐమ్యాక్స్ స్క్రీన్ కూడా ఉంటుంది అని ఆశిస్తున్నట్టు తెలిపారు. అంటే ఆ సమయానికి ఈ సినిమాకి తగ్గట్టుగా కావాల్సిన స్క్రీన్ ఇంకా ముందే ఐమ్యాక్స్ స్క్రీన్ వస్తుందని అంత నమ్మకంగా చెపుతున్నారంటే డెఫినెట్ గా వస్తుందనే అనుకోవాలి.

Exit mobile version