కార్తికేయ కామెంట్స్ కి ఎమోషనలైన రమా రాజమౌళి !

రాజమౌళి – మహేష్ బాబు వారణాసి సినిమా టైటిల్‌, స్పెషల్‌ వీడియోను చిత్ర బృందం రిలీజ్ చేసింది. ఈ సందర్భంగా యువ నిర్మాత కార్తికేయ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. కార్తికేయ మాట్లాడుతూ..‘నాకు ఇంత పెద్ద ప్రాజెక్ట్‌ త్వరగా వస్తుందనుకోలేదు. ఇందులో చేస్తున్న వారందరూ లెజెండ్స్‌. ఇది నాకు దక్కిన అదృష్టం. ఇండియన్‌ సినిమాను గ్లోబల్‌కు తీసుకెళ్లడం.. గ్లోబల్‌ ఆడియన్స్‌ను ఇండియా వైపు చూసేలా చేస్తున్నాం. ఈ ఈవెంట్‌ హైదరాబాద్‌లో చేయడం సంతోషంగా ఉంది. అందరికీ థ్యాంక్స్‌’ అంటూ కార్తికేయ చెప్పుకొచ్చారు.

ఐతే, కార్తికేయ ఎమోషనల్‌ కామెంట్స్ కి ఆయన తల్లి రమా రాజమౌళి భావోద్వేగానికి గురయ్యారు. పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. శ్రీ దుర్గా ఆర్ట్స్‌ పతాకంపై కేఎల్‌ నారాయణ, కార్తికేయ నిర్మిస్తున్నారు. అన్నట్టు ఈ సినిమా గ్లింప్స్ అందర్నీ ఆకట్టుకుంది. ముఖ్యంగా గ్లింప్స్ చివర్లో నంది వాహనంపై ఉగ్రరూపంలో మహేష్ కనిపించడంతో ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ గా ఫీల్ అవుతున్నారు. మొత్తానికి ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి.

Exit mobile version