మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు బుచ్చిబాబు సాన తెరకెక్కించిన లేటెస్ట్ అవైటెడ్ చిత్రమే పెద్ది. మంచి అంచనాలు ఉన్న ఈ సినిమా కోసం అభిమానులు ఎగ్జైటెడ్ గా ఉన్నారు. ఈ ఉత్సాహం నడుమ మేకర్స్ రిలీజ్ చేసిన ఫస్ట్ సింగిల్ చికిరి చికిరి ఫస్ట్ సింగిల్ సెన్సేషనల్ హిట్ అయ్యింది. అయితే ఒక్క మన దేశంలోనే కాకుండా గ్లోబల్ లెవెల్లో చాలా దేశాల నుంచే ఈ సాంగ్ రీల్స్ హుక్ స్టెప్ పై పడుతున్నాయి.
వెస్ట్రన్ దేశాలు, జపాన్ ఇంకా నేపాల్ తదితర ప్రాంతాల నుంచి సోషల్ మీడియా ఫీడ్ లో రీల్స్ చికిరి చికిరి మ్యానియా తోనే కనిపిస్తున్నాయి. దీనితో ఈ సాంగ్ కి రీచ్ మాత్రం అదిరిపోయింది అని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా వెంకట సతీష్ కిలారు నిర్మాణం వహిస్తున్నారు. అలాగే వచ్చే ఏడాది మార్చ్ 27న గ్రాండ్ గా పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమాని మేకర్స్ రిలీజ్ కి తీసుకొస్తున్నారు.
