మోలీవుడ్ విలక్షణ నటుడు దుల్కర్ సల్మాన్ ఎలాంటి పెర్ఫామర్ అనేది తెలుగు ఆడియెన్స్ కి కూడా ప్రత్యేకంగా చెప్పాల్సి పని లేదు. తను హీరోగా తనతో పాటుగా మరింతమంది విలక్షణ నటుల సమాహారంగా వస్తున్న అవైటెడ్ సినిమానే కాంత. దర్శకుడు సెల్వమని సెల్వరాజ్ తెరకెక్కించిన ఈ బై లింగువల్ సినిమా ఇటీవల వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ తో సాలిడ్ రెస్పాన్స్ అందుకుంది.
ఇక అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న అవైటెడ్ ట్రైలర్ ఇప్పుడు వచ్చింది. మరి ఈ ట్రైలర్ మాత్రం సాలిడ్ గా ఉందని చెప్పాలి. దుల్కర్ సల్మాన్, సముద్రకని తండ్రీకొడుకులుగా కనిపించనున్నారని ఇది వరకే తెలిసిందే. అయితే వీరి నడుమ వెండి తెర వెనుక జరిగిన తెలియని సమయం తాలూకా పరిస్థితితులని దర్శకుడు అత్యంత సహజంగా ప్రెజెంట్ చేయడం అనేది ఆకట్టుకునే అంశం అని చెప్పాలి.
ఇద్దరి నడుమ సాలిడ్ డ్రామా ఆడియెన్స్ ని కట్టిపడేసేలా కనిపిస్తుంది. నటి భాగ్యశ్రీ కి కూడా మంచి రోల్ పడినట్లు ఈ ట్రైలర్ లో చూస్తే అనిపిస్తుంది. ఇక వీరితో పాటుగా సర్ప్రైజింగ్ ప్యాక్ మాత్రం రానా దగ్గుబాటి అని చెప్పాలి. రానా ఎటువంటి పోటెన్షియల్ ఉన్న నటుడో అందరికీ తెలిసిందే. అలా మరో సీరియస్ రోల్ లో తను కనిపిస్తున్నాడు. డైనమిక్ పోలీస్ ఆఫీసర్ గా మంచి లుక్ తో తను కనిపిస్తున్నాడు.
ఇక ఈ ట్రైలర్ లో నిర్మాణ విలువలు, కెమెరా వర్క్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ లు మరింత కథనంలో పరిస్థితిని ఎలివేట్ చేశాయని చెప్పవచ్చు. దుల్కర్ నుంచి మహానటి తర్వాత తన వెర్షన్ లో ఒక ఫుల్ ఫ్లెడ్జ్ సినిమా పడితే ఎలా ఉంటుందో పలు వేరియేషన్స్ తో ఇది కనిపిస్తుంది. సో ఈ నవంబర్ 14 వరకు వేచి చూడాల్సిందే.
ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
