హిట్ ప్లాప్ తో సంబంధం లేకుండా తన నుంచి ఓ సినిమా అంటే మంచి హైప్ ఇవ్వగలిగే దర్శకుల్లో లోకేష్ కనగరాజ్ కూడా ఒకరు. ఇటీవల వచ్చిన కూలీ అంచనాలు అందుకోకపోయినప్పటికీ మంచి వసూళ్లు అయితే సాధించింది. ఇక ఈ సినిమా తర్వాత తన ప్రాజెక్ట్ పట్ల మరింత క్రేజీ రూమర్స్ వినిపోయించాయి.
ఇలా ఖైదీ 2 ఇమిడియేట్ గా ఉంటుంది అని తెలిసింది కానీ లేటెస్ట్ గా మరో క్రేజీ బజ్ ఇప్పుడు వినిపిస్తోంది. దీనితో లోకేష్ కనగరాజ్ లైన్ లో స్టార్ హీరో అజిత్ కుమార్ ఉన్నట్టు ఇపుడు కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. అజిత్ తో సినిమా కోసం అభిమానులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారు. మరి ఈ టాక్ నిజం అయితే కోలీవుడ్ లో మరో భారీ గ్రాసర్ పడే ఛాన్స్ ఉందని చెప్పవచ్చు.
