ఈ నవంబర్ నెల మొదలు కావడంతోనే సోషల్ మీడియా అంతా సూపర్ స్టార్ మహేష్ బాబు అబిమానుల కంట్రోల్ లోకి వెళ్ళిపోయింది. ఈ నెల మధ్యలో మహేష్ బాబు, దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో చేస్తున్న సెన్సేషనల్ ప్రాజెక్ట్ తాలూకా గ్రాండ్ లాంచ్ ఈవెంట్ ని ప్లాన్ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.
భారీ ఈవెంట్ ని అది కూడా మొదటిసారి ఓ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో లైవ్ స్ట్రీమింగ్ కి తీసుకొస్తున్న ఈ ప్రాజెక్ట్ ఆ సింగిల్ ఈవెంట్ కోసమే భారీ ఖర్చు జక్కన్న పెట్టిస్తున్నట్టు తెలుస్తుంది. లేటెస్ట్ రూమర్స్ ప్రకారం కేవలం ఈ ఒక్క ఈవెంట్ కి 15 కోట్లకి పైగా పెడుతున్నారట. సో ఆరంభమే ఈ లెవెల్లో ఉంటే ఇక రానున్న రోజుల్లో ఈ సినిమా నుంచి ఏ రేంజ్ సర్ప్రైజ్ లు ఉంటాయి అనేది అర్ధం చేసుకోవచ్చు.
