గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, మాస్ చిత్రాల డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘అఖండ 2’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. డిసెంబర్ 5న విడుదలకు సిద్ధమైన ఈ చిత్రం ఇప్పటికే టీజర్‌తో హైప్ క్రియేట్ చేసింది.
ఇక ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ‘తాండవం’ నవంబర్ 7న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ తాజాగా వెల్లడించారు. థమన్ అందించిన ఈ పాట ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని టీమ్ చెబుతోంది.
మేకర్స్ పాన్ ఇండియా స్థాయిలో భారీ ప్రమోషన్ ప్లాన్ చేస్తున్నారు. బోయపాటి యాక్షన్ టచ్, బాలయ్య పవర్ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్ కలయికగా ‘అఖండ 2’ బాక్సాఫీస్ వద్ద భారీ హిట్‌గా నిలుస్తుందనే అంచనాలు ఉన్నాయి.
