మన టాలీవుడ్ ప్రముఖ నటుడు అలాగే నిర్మాత కూడా అయినటువంటి బండ్ల గణేష్ ఇటీవల యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన కే ర్యాంప్ సినిమా సక్సెస్ మీట్ లో తను చేసిన కొన్ని వివాదాస్పద కామెంట్స్ షాకింగ్ గా మారాయి. ఓ యువ స్టార్ హీరోని తను టార్గెట్ చేసినట్టు ఆ మాటలు ప్రచారం అయ్యాయి. మరి ఈ కామెంట్స్ పై లేటెస్ట్ గా బండ్ల గణేష్ స్పందించడం జరిగింది.
సోషల్ మీడియా వేదికగా “ఇటీవల కె రాంప్ సినిమా సక్సెస్ మీట్‌లో నేను మాట్లాడిన మాటలు కొందరిని బాధపెట్టాయని తెలిసింది. నేను ఎవరినీ ఉద్దేశించి మాట్లాడలేదు. నా ఉద్దేశం అందరూ బాగుండాలి, కళామాత ఆశీస్సులతో అందరం పైకి రావాలని మాత్రమే. ఎవరైనా బాధపడి ఉంటే క్షమాపణలు.” అని చెప్పడం ఆ కాంట్రవర్సీకి ముగింపుగా మారింది. మరి ఆ కొందరు ఎవరు అంతలా హర్ట్ అయ్యారా అనేది మరోసారి చర్చగా మారింది.
ఇటీవల కె రాంప్ సినిమా సక్సెస్ మీట్‌లో నేను మాట్లాడిన మాటలు కొందరిని బాధపెట్టాయని తెలిసింది. నేను ఎవరినీ ఉద్దేశించి మాట్లాడలేదు.
నా ఉద్దేశం అందరూ బాగుండాలి, కళామాత ఆశీస్సులతో అందరం పైకి రావాలని మాత్రమే.మీ బండ్ల గణేష్
— BANDLA GANESH. (@ganeshbandla) November 5, 2025
