రీసెంట్ గా మన టాలీవుడ్ దగ్గర రిలీజ్ కి వచ్చిన చిత్రాల్లో యంగ్ అండ్ టాలెంటెడ్ నటులు ప్రియదర్శి, రాగ మయూర్ అలానే విష్ణు ఓయ్ ఇంకా ప్రసాద్ బెహరాలు నటించిన కామెడీ చిత్రం మిత్ర మండలి కూడా ఒకటి. ఈ దీపావళి కానుకగా వచ్చిన ఈ సినిమాని దర్శకుడు విజయేందర్ ఎస్ తెరకెక్కించారు. అయితే ఈ సినిమా అనుకున్న రేంజ్ సక్సెస్ కాలేదు కానీ ఇప్పుడు ఓటీటీలో అయితే స్ట్రీమింగ్ కి రావడానికి సిద్ధం అయ్యింది.
ఈ సినిమా ఓటీటీ హక్కులు అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకోగా వారు ఇప్పుడు డేట్ ఇచ్చేసారు. ఈ నవంబర్ 6 నుంచి అంటే రేపటి నుంచి సినిమా అందుబాటులోకి రానుంది. కేవలం తెలుగు లోనే సినిమా స్ట్రీమింగ్ రావడానికి రెడీ అవుతోంది. ఇక ఈ సినిమాలో నిహారిక ఎన్ ఎం హీరోయిన్ గా నటించగా బన్నీ వాసు సమర్పణలో విడుదల అయ్యింది.
