బాలీవుడ్ వెటరన్ నటుడు ధర్మేంద్ర ఆసుపత్రిలో చేరారు. ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో ఆయనను జాయిన్ చేశారు కుటుంబ సభ్యులు. ఆయన కొన్ని ఆరోగ్య సమస్యల కారణంగా ఆసుపత్రిలో జాయిన్ అయ్యారని తెలుస్తోంది.
89 ఏళ్ల వయసుగల ధర్మేంద్ర ఆరోగ్యంగానే ఉన్నారని.. అయితే, రెగ్యులర్ చెకప్‌ల కోసం ఆయన ఆసుప్రతిలో చేరారని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ విషయం తెలుసుకున్న ధర్మేంద్ర అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కాగా, ఈ వయసులో కూడా ఆయన సినిమాలు చేస్తుండటం విశేషం. త్వరలో విడుదల కానున్న ‘ఇక్కీస్’ సినిమాలో ఆయన కనిపించబోతున్నారని వార్తలొస్తున్నాయి.
