బాలయ్య సరసన నయనతార ఫిక్స్ !

బాలయ్య బాబు – గోపీచంద్ మలినేని కలయికలో సతీష్ కిలారు నిర్మిస్తున్న పీరియాడిక్ సినిమాలో నయనతార నటించబోతున్నారని తెలుస్తోంది. గతంలో బాలయ్య సరసన నయనతార నటించి మెప్పించింది. కాబట్టి, ఈ సినిమాలో ఆమెనే తీసుకుంటే మంచిదని దర్శకనిర్మాతలు నిర్ణయం తీసుకున్నారట. నయనతార ప్రస్తుతం మెగాస్టార్ సరసన మన శంకర ప్రసాద్ గారు సినిమా చేస్తున్నారు. ఆ తర్వాత మరో సినిమాకు సైన్ చేశారు. ఇప్పుడు ఆమె లిస్ట్ లోకి బాలయ్య సినిమా కూడా చేరింది.

ఇక ఈ సినిమా విషయానికి వస్తే.. ఈ సినిమాలో కొంత హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ వుంటుందని, బాలకృష్ణ మహరాజుగా కనిపిస్తారని టాక్. ప్రస్తుతం ఈ సినిమా బృందం, దర్శకుడు గోపీచంద్ మలినేని రాజస్థాన్ లో కోటల రెక్కీ లో వున్నారు. అన్నట్టు ఈ సినిమా గురించి గోపీచంద్‌ మలినేని ఎక్స్‌ వేదికగా ఆ మధ్య స్పందిస్తూ.. ‘‘గాడ్‌ ఆఫ్‌ మాసెస్‌ ఈజ్‌ బ్యాక్‌.. ఈసారి మా గర్జన మరింత గట్టిగా ఉండనుంది. బాలకృష్ణతో కలిసి మరోసారి వర్క్‌ చేస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఇది చరిత్రలో నిలిచిపోయే చిత్రం కానుంది’’ అని తన పోస్ట్ లో పేర్కొన్నారు. నందమూరి బాలకృష్ణ నటించనున్న 111 ప్రాజెక్ట్‌ ఇది

Exit mobile version