యంగ్ హీరోతో సీనియర్ దర్శకుడు ఫిక్స్ !

srinu vaitla

దర్శకుడు శ్రీను వైట్ల – హీరో శర్వానంద్ కాంబినేషన్ లో సినిమా రాబోతుందని వార్తలు వస్తున్నాయి. గోపీచంద్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ కామెడీ ‘విశ్వం’ ఏవరేజ్ గా నిలిచింది. దీంతో, ఎలాగైనా మళ్ళీ టాలీవుడ్ లో తన తర్వాత సినిమాతో బిజీ అయ్యేందుకు శ్రీనువైట్ల తెగ కష్ట పడుతున్నాడట. ఈ క్రమంలోనే మొదట నితిన్ కి కథ చెప్పాడు. నితిన్ కూడా శ్రీను వైట్లతో సినిమా చేయడానికి మొదట ఇంట్రెస్ట్ చూపించాడు.

ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల నితిన్ ప్లేస్ లోకి ఇప్పుడు శర్వానంద్ వచ్చాడు. శర్వానంద్ కూడా శ్రీనువైట్లతో సినిమా చేయాలనుకుంటున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా శ్రీనువైట్ల, శర్వానంద్ కి ఒక కథ చెప్పాడని.. శర్వానంద్ కి కథ కూడా నచ్చిందని.. ఈ ఏడాది చివర్లో వీరిద్దరి కలయికలో సినిమా మొదలు కానుంది. ఈ సినిమాలో మరో సీనియర్ హీరో కూడా కనిపిస్తాడని తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించనుంది.

Exit mobile version