ఈ కాంబో సెట్ అయితే.. కిక్కు గ్యారెంటీ..?

Raviteja-And-Surender-Reddy

టాలీవుడ్‌లో కొన్ని కాంబినేషన్‌లకు మంచి క్రేజ్ ఉంటుంది. అలాంటి కాంబోల్లో మాస్ రాజా రవితేజ, స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి కాంబో కూడా ఒకటి. ఈ కాంబోలో గతంలో కిక్, కిక్-2 చిత్రాలు వచ్చాయి. కిక్ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. అయితే, కిక్-2 మాత్రం ఫెయిల్యూర్ చిత్రంగా నిలిచింది.

దీంతో ఈ కాంబో మళ్లీ ఇప్పటివరకు సెట్ కాలేదు. అయితే, ఇప్పుడు సినీ సర్కిల్స్‌లో వస్తున్న వార్తల ప్రకారం రవితేజ, సురేందర్ రెడ్డి త్వరలో మరోసారి చేతులు కలపబోతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల సురేందర్ రెడ్డి రవితేజతో ఓ సినిమా చేసేందుకు ప్రస్తావన తీసుకొచ్చాడని.. దీనికి రవితేజ కూడా పాజిటివ్‌గా రెస్పాన్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

మరి నిజంగానే రవితేజతో సురేందర్ రెడ్డి మరోసారి చేతులు కలుపుతారా.. ఒకవేళ నిజంగానే వారిద్దరు కలిసి సినిమా చేస్తే అది ప్రేక్షకులకు కిక్ ఇస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది.

Exit mobile version