‘కలర్ ఫోటో’ చిత్రంతో అదిరిపోయే గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు సందీప్ రాజ్, ఇప్పుడు రోషన్ కనకాల హీరోగా ‘మోగ్లీ 2025’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. పూర్తి అడ్వెంచరస్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా ఈ మూవీ రానుంది.
ఇప్పటికే రిలీజ్ అయిన ఈ మూవీ ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. అయితే, తాజాగా ఈ చిత్ర రిలీజ్ డేట్ను చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ చిత్రాన్ని డిసెంబర్ 12న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఈ మేరకు ఓ అనౌన్స్మెంట్ వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు.
ఈ సినిమాలో సాక్షి మద్హోల్కర్ హీరోయిన్గా నటిస్తుండగా బండి సరోజ్ కుమార్ విలన్గా నటిస్తున్నాడు. కాల భైరవ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టి.జి.విశ్వప్రసాద్, కృతి శెట్టి ప్రొడ్యూస్ చేస్తున్నారు
Mass ki, Class ki…
Youth ki, Family audience ki…Every section ki BLOCKBUSTER THEATRICAL EXPERIENCE GUARANTEED with this ONE-OF-ITS-KIND love story #MOWGLI ❤️????#Mowgli2025 GRAND RELEASE WORLDWIDE ON 12th DEC 2025 ????????
A @SandeepRaaaj directorial.
????ing @RoshanKanakala,… pic.twitter.com/FjVRbHdLWq— People Media Factory (@peoplemediafcy) October 11, 2025