AI డేంజర్: ఆ ఫొటోస్ పై ‘ఓజి’ హీరోయిన్ వివరణ

ప్రస్తుత రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తాలూకా ప్రవాహం ఏ స్థాయిలో విస్తరిస్తోంది అనేది అందరికీ తెలిసిందే. అయితే దీనివల్ల కొంత మంచి ఎలా జరుగుతుందో అదే విధంగా చెడు కూడా జరుగుతుంది. మరి ఇది పబ్లిక్ ఫిగర్స్ విషయంలో అయితే మరింత దారుణంగా వినియోగించబడుతుంది అని చెప్పాలి. లేటెస్ట్ గా ఓజి సినిమా హీరోయిన్ ప్రియాంక అరుల్ మోహన్ ఇందుకు ఎఫెక్ట్ కావాల్సి వచ్చింది.

ఆమెపై కొన్ని షాకింగ్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం మొదలయ్యాయి. దీనితో అవి నిజమే అని చాలా మంది అనుకోగా వీటిపై ఓజి బ్యూటీ ఫైనల్ గా వివరణ ఇచ్చింది. తనపై AI తో సృష్టించబడ్డ కొన్ని తప్పుడు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అని దయచేసి వాటిని ఎవరు నమ్మొద్దు ఎంకరేజ్ చేయొద్దని విన్నవించుకుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని కేవలం న్యాయబద్ధమైన సృజనాత్మక కోసం వాడాలి తప్పితే ఇలాంటి వాటి కోసం కాదని తెలిపింది. దీనితో ప్రియాంక మోహన్ పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది.

Exit mobile version