లాటరీ ‘కింగ్’ కోసం మరోసారి ఎవర్‌గ్రీన్ బ్యూటీ..?

Tabu-Nagarjuna

టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున ఇటీవల తన కెరీర్‌లోని మైల్‌స్టోన్ 100వ చిత్రాన్ని సైలెంట్‌గా స్టార్ట్ చేశాడు. తమిళ దర్శకుడు ఆర్.కార్తీక్ డైరెక్షన్‌లో ఈ సినిమా రూపొందుతోంది. ఇక ఈ సినిమాతో నాగార్జున ఎలాంటి కంటెంట్ పట్టుకొస్తాడా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. అయితే, ఈ సినిమాకు ‘లాటరీ కింగ్’ అనే టైటిల్‌ను పెట్టేందుకు మేకర్స్ ఆలోచిస్తున్నారట.

నాగార్జున కెరీర్‌లో ప్రెస్టీజియస్ చిత్రంగా రాబోతున్న ఈ మూవీలో క్యాస్టింగ్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ టబూ నటించబోతున్నట్లు సినీ సర్కిల్స్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో ‘నిన్నే పెళ్లాడతా’ వంటి రొమాంటిక్ బ్లాక్‌బస్టర్ చిత్రంలో నటించిన ఈ జంట ప్రేక్షకుల్లో ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకుంది. ఇక ఆ తర్వాత ‘ఆవిడా మా ఆవిడే’ సినిమాలో నటించారు. ఆ తర్వాత ఈ జోడీ మళ్లీ కలిసి నటించలేదు.

దీంతో ఇప్పుడు నాగ్ కెరీర్‌లో మైల్‌స్టోన్ 100వ చిత్రంలో టబూ నటిస్తుందనే వార్తతో అక్కినేని అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. మరి నిజంగానే ఈ సినిమాలో టబూ నటిస్తుందా అనేది అఫీషియల్‌గా తెలియాల్సి ఉంది.

Exit mobile version