గట్టి పోటీ మధ్య ‘కె-ర్యాంప్’ టార్గెట్ ఎంతంటే..?

హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కె-ర్యాంప్’ దీపావళి కానుకగా రిలీజ్‌కు రెడీ అయింది. ఇప్పటికే వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ ఈ మూవీపై మంచి బజ్ క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమా దీపావళి కానుకగా పలు సినిమాలతో పోటీగా దిగుతోంది. అయితే, ఈ సమయంలో కూడా ఈ చిత్ర టార్గెట్ చర్చనీయాంశంగా మారింది.

సినీ సర్కిల్స్ టాక్ ప్రకారం ఈ చిత్రం ఇండియా వైడ్‌గా దాదాపు రూ.8 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలోకి దిగుతుందట. అంటే ఈ చిత్రం వసూలు చేయాల్సిన గ్రాస్ రూ.16 కోట్లు. దీపావళి బరిలో మొత్తం ఆరు సినిమాలు(మూడు తెలుగు, మూడు డబ్బింగ్) రిలీజ్ అవుతుండటంతో పోటీ తీవ్రంగా ఉంది.

ఈ టార్గెట్ పెద్దది కాకపోయినా, కంటెంట్‌లో ఏమాత్రం తేడా వచ్చినా సినిమాకు డ్యామేజ్ జరిగే అవకాశం ఉందని సినీ ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు. మరి ఈ పోటీలో కె-ర్యాంప్ కలెక్షన్లతో నిజంగానే ర్యాంప్ ఆడేస్తుందా అనేది చూడాలి.

Exit mobile version