రీసెంట్ గా కోలీవుడ్ సినిమా దగ్గర తన సత్తా చాటి తెలుగులో కూడా మంచి మార్కెట్ ని అందుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో ప్రదీప్ రంగనాథన్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా యువతకి కనెక్ట్ అయ్యే సబ్జెక్టు లతో వస్తున్న తాను ఇప్పుడు మరోసారి అలాంటి సినిమాతో రాబోతున్నాడు. మరి ఆ చిత్రమే “డ్యూడ్”.
దర్శకుడు కీర్తీశ్వరన్ తెరకెక్కించిన ఈ సినిమా దీపావళి కానుకగా రాబోతుండగా దీని తాలూకా ట్రైలర్ ని ఇపుడు మేకర్స్ రిలీజ్ చేశారు. మరి ఈ ట్రైలర్ చూసాక మరోసారి టాలీవుడ్ కోలీవుడ్ యువతకి ఓ సాలిడ్ ఎంటర్టైనర్ ని అందించేలా ఉన్నాడని చెప్పొచ్చు. ఈ యువ బక్క పల్చని పర్సనాలిటీని వాడుకొని ఎలాంటి మ్యాజిక్ చేయొచ్చో ఇది వరకు కొందరు దర్శకులు చూపించారు.
ఇక ఇప్పుడు కీర్తీశ్వరన్ వంతు వచ్చింది అని చెప్పాలి. ప్రదీప్ కి డిజైన్ చేసిన స్టైలిష్ మ్యానరిజంలు కానీ యాక్షన్ పార్ట్ గాని ఈ ట్రైలర్ లో సూపర్బ్ గా కనిపిస్తున్నాయి. ఓ పక్క ఎంటర్టైన్మెంట్, ఇంకోపక్క యాక్షన్, మరోపక్క లవ్ అండ్ రొమాంటిక్ ట్రాక్ లు సాలిడ్ గా కనిపిస్తున్నాయి.
మమిత బైజుతో కానీ నేహా శెట్టితో సెపరేట్ ట్రాక్ లు ఇంప్రెసివ్ గా కనిపిస్తుండగా కమెడియన్ సత్య, శరత్ కుమార్ ఇలా చాలామంది నటుల నుంచి మంచి ఎంటర్టైన్మెంట్ దొరికేలా కనిపిస్తుంది. ఇలా ఓవరాల్ గా మాత్రం ఈ దీపావళికి డ్యూడ్ బాగానే క్లిక్ అయ్యేలా కనిపిస్తున్నాడు. ఇక ఈ చిత్రానికి సాయి అభ్యంకర్ సంగీతం అందించగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహించారు.