వింటేజ్ డాన్స్ మోడ్ లో రెబల్ స్టార్.. ‘రాజా సాబ్’ పై థమన్ క్రేజీ లీక్!

The-Raja-Saab

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ నుంచి చాలా కాలం నుంచి మిస్ అవుతున్న వింటేజ్ ట్రీట్ ని ఫుల్ మీల్స్ లా ఇచ్చేందుకు దర్శకుడు మారుతీ సిద్ధం చేస్తున్న అవైటెడ్ చిత్రమే “ది రాజా సాబ్”. భారీ అంచనాలు సెట్ చేసుకున్న ఈ చిత్రాన్ని మేకర్స్ అన్ని అంశాలు మేళవించి తెరకెక్కిస్తుండగా సంగీత దర్శకుడు థమన్ రెబల్ స్టార్ డాన్స్ సాంగ్ పై క్రేజీ అప్డేట్ అందించాడు.

మువ్వలు బూట్లు తొడుక్కొని అదిరే డాన్స్ నెంబర్ కోసం రెడీ గా ఉన్న ప్రభాస్ పై విజువల్స్ చూపించి ఫ్యాన్స్ కి మరింత కిక్ ని తాను అందించాడు. మరి బిగ్ స్క్రీన్ పై ఈ సాంగ్ ఎలా ఉంటుందో చూడాల్సిందే. ఇక ఈ చిత్రంలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ అలాగే రిద్ధి కుమార్ హీరోయిన్స్ గా నటిస్తుండగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మాణం వహిస్తుండగా వచ్చే ఏడాది జనవరి 9న భారీ లెవెల్లో రిలీజ్ కి తీసుకొస్తున్నారు.

Exit mobile version