‘డ్యూడ్’ సెన్సార్ పూర్తి.. రన్‌టైమ్ ఎంతంటే..?

dude

తమిళ యంగ్ సెన్సేషన్ ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన లేటెస్ట్ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘డ్యూడ్’ దీపావళి సందర్భంగా అక్టోబర్ 17న గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి కీర్తిశ్వరన్ దర్శకత్వం వహించగా, మమితా బైజు హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక ప్రస్తుతం ప్రమోషన్లు జోరుగా చేస్తున్న చిత్ర యూనిట్ పలు ఈవెంట్‌లను కూడా ప్లాన్ చేస్తోంది.

ఈ సినిమా తాజాగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని U/A సర్టిఫికెట్ పొందింది. ఈ చిత్రానికి 2 గంటల 20 నిమిషాల రన్‌టైమ్‌ను మేకర్స్ ఫిక్స్ చేవారు. ఇక ఈ మూవీ ట్రైలర్‌ను అక్టోబర్ 9న రిలీజ్ చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు.

ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యేర్నేని, రవి శంకర్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమాలో శరత్ కుమార్, హృదు హరూన్, రోహిణి, ఐశ్వర్య శర్మ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సాయి అభ్యంకర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.

Exit mobile version