కన్నడ స్టార్ నటుడు రిషబ్ శెట్టి హీరోగా రుక్మిణి వసంత్ సాలిడ్ రోల్ లో రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలోనే తెరకెక్కించిన అవైటెడ్ చిత్రమే “కాంతార చాప్టర్ 1”. మంచి అంచనాలు నడుమ రిలీజ్ కి వచ్చిన ఈ సినిమా వాటిని అందుకొని ప్రపంచ వ్యాప్తంగా ఆల్రెడీ 300 కోట్ల క్లబ్ లో జాయిన్ అయ్యి సెన్సేషన్ ని సెట్ చేసింది. ఇక యూఎస్ మార్కెట్ లో కూడా మంచి రన్ లో ఈ సినిమా దూసుకెళ్తుంది.
ఇలా నార్త్ అమెరికా ప్రాంతంలో ప్రస్తుతం 2.7 మిలియన్ డాలర్స్ గ్రాస్ వసూలు చేసి 3 మిలియన్ డాలర్స్ క్లబ్ లో జాయిన్ అయ్యేందుకు దూసుకెళ్తుంది. ఇలా మొత్తానికి కాంతార చాప్టర్ 1 మాత్రం సాలిడ్ వసూళ్ళతో అదరగొడుతుంది అని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి అజనీష్ లోకనాథ్ సంగీతం అందించగా హోంబళే ఫిల్మ్స్ వారు నిర్మాణం వహించారు. అలాగే ఫ్రాంచైజ్ నుంచి మరో సినిమా ఉన్న సంగతి తెలిసిందే.
From divine rage to box office glory ⚡️#KantaraChapter1 races past $2.7 Million+ North America Gross (Including Unreported)
The legend only grows stronger
In cinemas now – https://t.co/L7QzH8B7el pic.twitter.com/CjtVJ6Z6g3
— Prathyangira Cinemas (@PrathyangiraUS) October 7, 2025