విజయ్ దేవరకొండ కారుకు ప్రమాదం

Vijay-Devarakonda

టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ కారుకు ప్రమాదం జరిగింది. ఆయన ప్రయాణిస్తున్న కారు జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లిలో ప్రమాదానికి గురైంది. ఆయన పుట్టపర్తి నుంచి హైదరాబాద్‌కు తిరిగి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది.

నందికట్కూరు నుంచి పెబ్బేర్ వెళ్తున్న గొర్రెల లారీ అకస్మాత్తుగా బ్రేకులు వేయడంతో విజయ్ కారు ఎదురుగా వస్తున్న బొలెరో వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన కారు స్వల్పంగా దెబ్బతింది. అయితే, ఈ ప్రమాదంలో విజయ్ దేవరకొండకు ఎలాంటి గాయాలు కాలేదని తెలుస్తోంది.

కారు ప్రమాదం అనంతరం విజయ్ దేవరకొండ తన స్నేహితుడి కారులో హైదరాబాద్‌కి తిరిగి ప్రయాణించారు. ఈ వార్తతో అభిమానులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.

Exit mobile version