ఆ సాంగ్ ను అందరూ ఎంజాయ్ చేస్తారు – రష్మిక

Rashmika-Mandanna

రష్మిక మందన్నా – విజయ్‌ దేవరకొండ నిశ్చితార్థం అయిందంటూ సన్నిహిత వర్గాలు చెప్పడంతో రష్మిక పేరు ప్రస్తుతం ట్రెండింగ్‌లో కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో రష్మిక పెట్టిన ఓ పోస్ట్‌ ప్రస్తుతం వైరల్‌గా మారింది. తాజాగా ఆమె నటించిన ‘థామా’ సాంగ్‌ గురించి రష్మిక స్పందించింది. హిందీ సినిమా ‘థామా’ నుంచి ఇటీవల ‘నువ్వు నా సొంతమా’ అనే పాట రిలీజ్ అయింది. ఈ పాటలో రష్మిక తన అందంతో, డ్యాన్స్‌ మూమెంట్స్‌ తో యూత్ ను మెప్పించింది.

కాగా ఈ పాట గురించి రష్మిక మాట్లాడుతూ.. ‘మేము దాదాపు 12 రోజుల పాటు ఓ అద్భుతమైన ప్రదేశంలో షూటింగ్‌ చేశాం. ఆ చివరిరోజు మా దర్శకనిర్మాతలకు ఓ పాట చేయాలనే ఆలోచన వచ్చింది. ఆ లొకేషన్‌ నాకు కూడా నచ్చింది. కేవలం 3 – 4 రోజుల్లో మేం రిహార్సిల్స్‌ చేసి ఆ పాటను షూట్‌ చేశాం. షూట్ అయిపోయాక, ఆ పాట చూసి అందరం షాక్ అయ్యాం. ఈ పాటలో భాగమైన వారందరికీ అభినందనలు. ఈ సాంగ్‌ను అందరూ ఎంజాయ్‌ చేస్తారని ఆశిస్తున్నాను’ అంటూ రష్మిక చెప్పుకొచ్చింది.

Exit mobile version