కన్నడ హీరో కమ్ డైరెక్టర్ రిషబ్ శెట్టి రూపొందించిన మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ చిత్రం ‘కాంతార చాప్టర్ 1’ దసరా కానుకగా అక్టోబర్ 2న గ్రాండ్ రిలీజ్ అయింది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి ట్రెమండస్ రెస్పాన్స్ రావడంతో ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతుంది. పండుగ సీజన్ కూడా కలిసి రావడంతో ఈ చిత్రాన్ని చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కట్టారు.
ఫలితంగా ఈ మూవీ తొలి వీకెండ్లోనే ఏకంగా రూ.335 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. కేవలం 4 రోజుల్లోనే రూ.300 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టి కాంతార తన క్రేజ్‌ను మరోసారి చూపెట్టింది. ఇక ఈ సినిమాలో రిషబ్ శెట్టి పర్ఫార్మెన్స్కు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. అయితే, ఈ చిత్రానికి అసలు పరీక్ష సోమవారం నుంచి ఉండనుంది.
ఇక ఈ సినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటించగా అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందించారు. హోంబలే ఫిల్మ్స్ ఈ మూవీని ప్రతిష్టాత్మకంగా ప్రొడ్యూస్ చేశారు.