ట్విస్ట్.. నార్త్ లో డౌన్ అయ్యిన ‘కాంతార’ వసూళ్లు.. డే 2 ఎంతంటే

Kantara-Chapter-1

పాన్ ఇండియా సినిమా దగ్గర సెన్సేషన్ ని సెట్ చేసిన పలు చిత్రాల్లో శాండిల్ వుడ్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన కాంతార కూడా ఒకటి. రిషబ్ శెట్టి హీరోగా తన దర్శకత్వంలోనే తెరకెక్కించిన ఈ డివోషనల్ యాక్షన్ డ్రామాకి ప్రీక్వెల్ ఇపుడు వచ్చి అదే తరహాలో రెస్పాన్స్ ని అందుకుంది. మరి ఇప్పుడు ప్రీక్వెల్ కి డే 1 సాలిడ్ ఓపెనింగ్స్ వచ్చాయి. మెయిన్ గా చిత్ర యూనిట్ హిందీ వసూళ్లు కూడా ప్రత్యేకంగా తీసుకున్నారు.

ఇలా మొదటి రోజు 18 కోట్లకి పైగా నెట్ వసూళ్లు అందుకున్న ఈ సినిమా రెండో రోజు మాత్రం ఊహించని విధంగా డౌన్ అయ్యింది. మామూలుగా నార్త్ లో సినిమాలు రిలీజ్ డేట్ కాకుండా నెక్స్ట్ డే వర్కింగ్ డే అయినప్పటికీ టాక్ బాగుంటే బెటర్ వసూళ్లే వస్తాయి. కానీ కాంతార కి మాత్రం 5 కోట్ల నెట్ వసూళ్లు డ్రాప్ అయ్యాయి. దీనితో రెండో రోజు ఈ సినిమా 13.5 కోట్లు అందుకుంది. ఇక ఈ శనివారం, ఆదివారం వసూళ్లు మళ్ళీ పెరిగే ఛాన్స్ అయితే ఉంది. మరి ఈ సినిమా హిందీలో ఎంతవరకు రాబడుతుందో చూడాలి.

Exit mobile version