‘నాటకం’, ‘తీస్ మార్ ఖాన్’ వంటి విభిన్న చిత్రాలతో గుర్తింపు పొందిన దర్శకుడు కళ్యాణ్ జీ గోగణ, తన తాజా చిత్రం ‘మారియో’ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను దసరా సందర్బంగా ఆవిష్కరించారు. “A Turbo-Charged Ramp Ride” అనే ట్యాగ్‌లైన్‌తో విడుదలైన ఈ పోస్టర్ మొదటి చూపుకే యాక్షన్, స్టైల్, రొమాన్స్ మూడింటి శక్తివంతమైన మేళవింపును సూచిస్తూ ఆసక్తిని రేకెత్తించింది. హీరో అనిరుధ్ చేతిలో రైఫిల్‌తో ఇచ్చిన ఇంటెన్స్ లుక్ హై-వోల్టేజ్ యాక్షన్‌కు నాంది పలికితే, ఎరుపు దుస్తుల్లో మెరిసిన హెబ్బా పటేల్ ఎనెర్జిటిక్ ప్రెజెన్స్‌తో ఆకట్టుకున్నారు. ఇద్దరి కెమిస్ట్రీ పోస్టర్‌లోనే స్పష్టంగా పలికింది. క్లాసిక్ కారు, చీకటి వాతావరణం, వర్షపు బిందువులు — ఇవన్నీ కలిసి థ్రిల్లర్ టోన్‌ను బలోపేతం చేస్తూ, సీట్ ఎడ్జ్ అనుభూతిని వాగ్దానం చేస్తున్నాయి.
సిల్వర్ స్క్రీన్ ప్రొడక్షన్స్ పతాకంపై, రిజ్వాన్ ఎంటర్‌టైన్‌మెంట్ సహనిర్మాణంలో తెరకెక్కుతున్న ‘మారియో’లో సంగీతాన్ని సాయి కార్తీక్, రాకేందు మౌళి అందిస్తున్నారు. పాటలు, మాటలతో పాటు కథా-సంభాషణల అభివృద్ధిలోనూ రాకేందు మౌళి కీలక పాత్ర పోషించగా, సినిమాటోగ్రఫీని ఎం.ఎన్. రెడ్డి నిర్వహిస్తున్నారు. ఎడిటింగ్ బాధ్యతలు మణికాంత్, మదీ మన్నెపల్లి చూసుకుంటున్నారు. కామెడీ, థ్రిల్‌లను విజయవంతంగా మేళవించిన కళ్యాణ్ జీ గోగణ ఈసారి మరింత సినిమాటిక్ అనుభవాన్ని అందించబోతున్నారని పోస్టర్ సూచిస్తోంది. ప్రస్తుతం చిత్రం శరవేగంగా నిర్మాణ దశలో ఉండగా, పండుగ సీజన్‌లో విడుదలైన ఈ ఫస్ట్ లుక్ ఇప్పటికే సోషిల్ మీడియాలో ట్రెండ్ అవుతూ, ‘మారియో’పై బజ్ సృష్టిస్తోంది.
