ప్రస్తుతం మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న అవైటెడ్ చిత్రం “పెద్ది” కోసం అందరికీ తెలిసిందే. మంచి హైప్ ఉన్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా కొనసాగుతుంది. మరి గేమ్ ఛేంజర్ లాంటి ఫెయిల్యూర్ తర్వాత కూడా ఈ చిత్రంపై మంచి బజ్ ఉండడంతో భారీ బిజినెస్ ని కూడా పెద్ది చేస్తుందట. ఇలా యూఎస్ మార్కెట్ లో భారీ బిజినెస్ ఆఫర్లు ఈ చిత్రానికి వస్తున్నట్టుగా ఇపుడు టాక్.
దీనితో పెద్ది చిత్రానికి సాలిడ్ టార్గెట్ ముందున్నట్టు తెలుస్తుంది. దీనితో ఈ సినిమా 8 మిలియన్ మేర టార్గెట్ తో అక్కడ దిగబోతున్నట్టుగా తెలుస్తుంది. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనేది చూడాలి. ఒక ఈ చిత్రానికి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా శివ రాజ్ కుమార్ అలాగే దివ్యెందు శర్మ, జగపతిబాబు తదితరులు నటిస్తున్నారు. అలాగే వృద్ధి సినిమాస్ వారు నిర్మాణం వహిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది మార్చ్ 27న గ్రాండ్ గా రిలీజ్ కి రాబోతుంది.