‘సంబరాల ఏటి గట్టు’ గ్లింప్స్ వీడియోకు డేట్ ఫిక్స్.. అదిరిపోయిన ప్రీ-గ్లింప్స్!

సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘సంబరాల ఏటి గట్టు’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు రోహిత్ కె.పి డైరెక్ట్ చేస్తుండగా పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ రూపొందుతోంది.

ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ఈ మూవీ పోస్టర్స్ ప్రేక్షకుల్లో అంచనాలు పెంచాయి. అయితే, తాజాగా దసరా కానుకగా ఈ చిత్రం నుండి ఓ సాలిడ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ప్రీ-గ్లింప్స్ వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ వీడియోలో సాయి దుర్గ తేజ్ పవర్‌ఫుల్ యాక్షన్ చేస్తూ కనిపించాడు.

ఈ చిత్ర గ్లింప్స్‌ను సాయి దుర్గ తేజ్ పుట్టినరోజు కానుకగా అక్టోబర్ 15న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ సినిమాలో ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్‌గా నటిస్తుండగా జగపతి బాబు, సాయి కుమార్, అనన్య నాగళ్ల తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కె.నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ప్రొడ్యూస్ చేస్తున్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version