SSMB29: మహేష్ నెక్స్ట్ లెవెల్ డెడికేషన్!

SSMB29

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఇపుడు దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో చేస్తున్న అవైటెడ్ చిత్రం కోసం అందరికీ తెలిసిందే. మరి ప్రపంచ వ్యాప్తంగా హైప్ ఉన్న ఈ చిత్రం కోసం అభిమానులు మంచి ఎగ్జైటెడ్ గా ఎదురు చూస్తుండగా మేకర్స్ సినిమా షూటింగ్ శరవేగంగా అంతే సైలెంట్ గా భారీ షెడ్యూల్స్ కానిచ్చేస్తున్నారు. అయితే ఈ సినిమా పట్ల మహేష్ బాబు డెడికేషన్ కోసం మరో వార్త వినిపిస్తుంది.

ఈ సినిమా కోసం మహేష్ బాబు ఎలాంటి డూప్ ని వాడట్లేదని ఎలాంటి రిస్క్ అయినా కూడా కేవలం తానే తీసుకుంటూ ఇప్పుడు వరకు సినిమా షూటింగ్ అంతా చేస్తున్నట్టు తెలుస్తుంది. మహేష్ బాబు డెడికేషన్ చూసి జక్కన్న కూడా సర్ప్రైజ్ అవుతున్నట్టు తెలుస్తుంది. ఇక ఇదిలా ఉండగా మహేష్ బాబు, రాజమౌళిల ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ నుంచి బిగ్ రివీల్ ఈ నవంబర్ లో ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. దీని కోసం వరల్డ్ వైడ్ ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Exit mobile version