‘ది రాజా సాబ్’ ట్రైలర్.. ఫుల్ సినిమాకి పక్కా ప్లాన్ రెడీ!

The-Raja-Saab

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ అవైటెడ్ చిత్రాల్లో దర్శకుడు మారుతీతో చేస్తున్న సాలిడ్ హారర్ ఎంటర్టైనర్ “ది రాజా సాబ్” కోసం అందరికీ తెలిసిందే. అయితే ఇది వరకే వచ్చిన టీజర్ మంచి అంచనాలు సెట్ చేసుకోగా లేటెస్ట్ గా ది రాజా సాబ్ ట్రైలర్ పై సాలిడ్ అప్డేట్ ని కూడా మేకర్స్ అందించారు. ఇక ఈ అప్డేట్ తో పాటుగా సినిమా పై మరో ఇంట్రెస్టింగ్ అంశం సంగీత దర్శకుడు థమన్ బయటపెట్టాడు.

తాము సినిమా కోసం భారీ ప్లానింగ్స్ లో ఉన్నట్టు తెలిపాడు. డిసెంబర్ లో భారీ ఫంక్షన్స్ అలాగే ఓ గ్రాండ్ ఈవెంట్ ని ప్లాన్ లో పెట్టినట్టుగా థమన్ రివీల్ చేసాడు. దీంతో రాజా సాబ్ ప్రమోషన్స్ పరంగా మాత్రం ఎలాంటి ఇబ్బంది లేదు అని చెప్పాలి. ఇక ఈ చిత్రంలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ లు నటిస్తుండగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మాణం వహిస్తున్నారు.

Exit mobile version