కమర్షియల్ డైరెక్టర్ మారుతి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో ఓ భారీ పాన్ ఇండియా సినిమాని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇక ఈ సినిమా అప్డేట్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఐతే, ది రాజా సాబ్ ట్రైలర్ను సెప్టెంబర్ 29, 2025న సాయంత్రం 6 గంటలకు విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. ఈ క్రమంలో ఒక పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. ప్రభాస్ తో పాటు, ఈ సినిమాలో సంజయ్ దత్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ మరియు రిద్ధి కుమార్ కథానాయికలు. ఈ సినిమా హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం.. ఐదు భాషల్లో ప్రపంచవ్యాప్తంగా జనవరి 9, 2026న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. మొత్తమ్మీద మారుతి ఈ ప్రాజెక్ట్ కోసం అద్భుతమైన ఎలిమెంట్స్ ను సిద్ధం చేశాడట. అన్నట్టు ప్రభాస్ కి పూర్తిగా ఇది కొత్త జోనర్ అవుతుంది. కాగా ప్రభాస్ తో మారుతి సినిమా చేస్తే.. ఇక మారుతి రేంజ్ మారిపోయినట్టే.