యూఎస్ మార్కెట్ లో స్ట్రాంగ్ వసూళ్లతో ‘మిరాయ్’.. నెక్స్ట్ భారీ మైల్ స్టోన్ దగ్గరకి

Mirai Movie

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో తేజ సజ్జ హీరోగా రితికా నాయక్ హీరోయిన్ గా దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించిన అవైటెడ్ చిత్రమే “మిరాయ్”. తక్కువ బడ్జెట్ తో భారీ అత్యున్నత ప్రమాణాలతో వచ్చిన ఈ సినిమా పాన్ ఇండియా వైడ్ సహా యూఎస్ మార్కెట్ ఆడియెన్స్ ని కూడా ఎంతగానో అలరించింది. అయితే ఇప్పటికీ సినిమా స్ట్రాంగ్ వసూళ్లతో యూఎస్ మార్కెట్ లో వెళుతుండడం విశేషం.

మరి ఈ చిత్రం లేటెస్ట్ గా అక్కడ 2.9 మిలియన్ డాలర్స్ మార్క్ ని టచ్ చేసి నెక్స్ట్ భారీ మైల్ స్టోన్ 3 మిలియన్ డాలర్స్ క్లబ్ లో జాయిన్ అయ్యేందుకు సిద్ధంగా ఉంది. మొత్తానికి మాత్రం మిరాయ్ తో మేకర్స్ మంచి లాభాలు అందుకుంటున్నారని చెప్పవచ్చు. ఇక ఈ చిత్రానికి గౌర హరి సంగీతం అందించగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మాణం వహించారు.

Exit mobile version