‘ఓజి’.. పవన్ టైటిల్ కార్డ్.. మెంటలెక్కించిన సుజీత్ విజన్

OG movie

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మేనియా ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో కమ్మేసింది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. తన అభిమాని దర్శకునిగా చేసిన లేటెస్ట్ సినిమా ఓజి విషయానికి వస్తే అనేక అంశాల్లో దీనిపట్ల హైప్ నెలకొంది. మరి వాటిలో పవన్ కళ్యాణ్ పై సాలిడ్ టైటిల్ కార్డ్ కూడా ఒకటి.

ఈ మధ్య కాలంలో దీనికి పీక్ డిమాండ్ ఫ్యాన్స్ లో నెలకొనగా దానికి లోకేష్ కనగరాజ్ సెట్ చేసిన స్టాండర్డ్స్ కూడా ఇంకెవరు టచ్ చెయ్యని విధంగా అనిపించాయి. కానీ అప్పుడొచ్చాడు సుజీత్ తన అభిమాన హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసం ఒక మ్యాడ్ విజన్ తో.

కేవలం ఈ టైటిల్ కార్డ్ కే పెట్టిన టికెట్ డబ్బులు సరిపోతాయి అని ఫ్యాన్స్ ఫీల్ అయ్యే రేంజ్ లో దీన్ని డిజైన్ చేయడం ఏదైతే ఉందో థియేటర్స్ ని బ్లాస్ట్ చేసేసింది. ఇది చూసిన ఫ్యాన్స్ సహా సాధారణ ఆడియెన్స్ కూడా ఒక రకంగా మెంతలెక్కిపోయిన రేంజ్ లో ఫీల్ అయ్యారు. మొత్తానికి ఈ విషయంలో మాత్రం సుజీత్ ప్రతి ఒక్కరి మైండ్ బ్లాక్ చేసి వదిలేసాడు.

Exit mobile version