పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ చిత్రం “ఓజి” బాక్సాఫీస్ విస్ఫోటనం సృష్టించడానికి మరికొన్ని గంటల్లోనే రాబోతుంది. భారీ హైప్ ని సొంతం చేసుకున్న ఈ సినిమాని దర్శకుడు సుజీత్ తెరకెక్కించగా తెలుగు రాష్ట్రాల్లో ఇంకా యూఎస్ మార్కెట్ లలో ఓజి తాండవం చేస్తుంది.
ఇక ఇదే ఊపులో ఓజి ఓపెనింగ్స్ పట్ల కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమా మొదటి రోజులు వసూళ్లుగా వరల్డ్ వైడ్ పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే కాకుండా మన టాలీవుడ్ లోనే ఒక బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ఈ చిత్రానికి దక్కే ఛాన్స్ ఉన్నట్టుగా వినిపిస్తుంది.
అయితే 100 కోట్ల మార్క్ ఈజీ అన్నట్టు ట్రేడ్ సర్కిల్స్ ఆల్రెడీ టాక్ ఉండగా ప్రీమియర్స్ డే 1 కలిపి ఈ మార్క్ 130 నుంచి 150 కోట్ల మధ్యలో వచ్చే ఛాన్స్ ఉన్నట్టుగా ఇపుడు తెలుస్తుంది. మొత్తానికి మాత్రం పవన్ కళ్యాణ్ కి ఒక్క సరైన సినిమా పడితే దాని తాలూకా ప్రభావం ఈ రేంజ్ లో ఉంటుందని చెప్పడంలో డౌట్ లేదు.