తమ్ముడు.. ఓజీ ట్రైలర్ అదిరింది..!

pawan-kalyan-chiranjeevi-

మెగాస్టార్ చిరంజీవి సినీ ప్రస్థానంలో 47 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ ఎమోషనల్ నోట్ పెట్టిన సంగతి తెలిసిందే. అయితే, తాజాగా పవన్ పెట్టిన నోట్‌కు మెగాస్టార్ చిరంజీవి తనదైన స్టయిల్‌లో రిప్లై ఇచ్చాడు.

‘‘తమ్ముడు.. మీ మాటలు నన్ను బాగా తాకాయి. ఆ మొదటి రోజుల్ని మళ్లీ గుర్తుకు తెచ్చాయి. ‘ప్రాణం ఖరీదు’ నుండి ఈ రోజు వరకు, మన కుటుంబం, స్నేహితులు, అభిమానులు, ప్రేక్షకుల అందరి ప్రేమ, ప్రోత్సాహం నాకు ఎల్లప్పుడూ లభిస్తూ వచ్చింది. మీరు చేసిన ప్రతిదానికి హృదయపూర్వక కృతజ్ఞతలు. దేవుని కటాక్షం ఎల్లప్పుడూ మీతో ఉండాలి!

‘OG’ ట్రైలర్‌ నాకెంతో నచ్చింది. మీ చిత్ర బృందం ఘన విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను.’’ అంటూ మెగాస్టార్ పవర్ స్టార్ ట్వీట్‌కు రిప్లై ఇచ్చాడు.

Exit mobile version