‘కల్కి 2’ నుంచి దీపికాని తీసేయడానికి గట్టి కారణాలే ఉన్నాయా?

Kalki

లేటెస్ట్ గా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నుంచి రానున్న పలు భారీ చిత్రాల్లో ఒకటైన కల్కి 2898 ఎడి కోసం అందరికీ తెలిసిందే. దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ భారీ ప్రాజెక్ట్ ఇండియన్ సినిమా నుంచి ఒక వరల్డ్ క్లాస్ చిత్రంగా వచ్చి అదరగొట్టింది. ఇక ఈ సినిమాకి సీక్వెల్ గా పార్ట్ 2 ని మేకర్స్ కన్ఫర్మ్ చేయగా ఈ సినిమా నుంచి నటి దీపికా పదుకోణ్ వైదొలగినట్టుగా మేకర్స్ ఇచ్చిన ఒక షాకింగ్ ట్విస్ట్ సినీ వర్గాల్లో వైరల్ గా మారింది.

మేకర్స్ కూడా ఈ అంశాన్ని కొంచెం కఱకు గానే చెప్పడం మరింత చర్చనీయాంశం అయ్యింది. అయితే అసలు ఈమెని ఎందుకు తీసేసారు అనే దానిపై పలు గట్టి కారణాలే ఉన్నాయని వినిపిస్తుంది. వీటిలో ఆమె టైమింగ్స్ సహా రెమ్యునరేషన్ లు పరంగా కూడా పెట్టిన కండిషన్స్ అన్నట్టు తెలుస్తుంది. ఆమె ఈ సినిమా గత పార్ట్ తో పోలిస్తే 25 శాతానికి అదనపు రెమ్యునరేషన్ పెంచితే ఆమె షూటింగ్ షిఫ్ట్ టైమింగ్ కూడా బాగా తగ్గించేసిందట.

కేవలం 5 గంటలు మాత్రమే షూట్ లో పాల్గొంటానని తెలిపినట్టు టాక్. ఇక ఇన్ని కండిషన్స్ పెట్టి పైగా కమిట్మెంట్ లేకపోవడంతో మేకర్స్ తమ ప్రయాణాన్ని అక్కడతో ముగించినట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. మొత్తానికి మాత్రం కల్కి పార్ట్ 2 విషయంలో ఒక్కసారిగా అలజడి రేగినట్టు అయ్యిందని చెప్పాలి.

Exit mobile version