పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన అవైటెడ్ సినిమానే “ఓజి”. ఇంకా రిలీజ్ కి కేవలం వారం మాత్రమే గడువు ఉంటే ఈ సమయంలో మేకర్స్ ఒకో పాత్రకి సంబంధించిన పోస్టర్ ని రిలీజ్ చేస్తున్నారు. ఇలా నిన్న అర్జున్ దాస్ పోస్టర్ ని రిలీజ్ చేస్తే లేటెస్ట్ గా నటుడు ప్రకాష్ రాజ్ పోస్టర్ ని కూడా రివీల్ చేశారు.
మరి ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ సత్య దాదాగా కనిపించనున్నట్టుగా తనపై ఓ కొత్త లుక్ తో రివీల్ చేశారు. మరి సినిమాలో తన రోల్ ఇంకెంత కీలకంగా ఉంటుందో చూడాలి. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు. అలాగే ఈ సెప్టెంబర్ 25న సినిమా గ్రాండ్ గా రిలీజ్ కి రాబోతుంది.