‘లిటిల్ హార్ట్స్’ నిర్మాత నెక్స్ట్.. అపుడే సాలిడ్ ఓటిటి డీల్ పూర్తి?

Little-Herats

మన తెలుగు సినిమా దగ్గర తమ టాలెంట్ తో అలరిస్తూ వచ్చిన యువ దర్శకుల్లో తన 90స్ బయోపిక్ సిరీస్ తో ఒక్కసారిగా అందరి దృష్టి ఆకర్షించిన యువ దర్శకుడు ఆదిత్య హాసన్ కూడా ఒకరు. మరి తన దర్శకత్వంలోనే కాకుండా నిర్మాణంలో వచ్చిన లేటెస్ట్ చిత్రమే “లిటిల్ హార్ట్స్”. మౌళి తనూజ్ హీరోగా పరిచయం అవుతూ శివాని నాగారం హీరోయిన్ గా దర్శకుడు సాయి మార్తాండ్ తెరకెక్కించిన ఈ సినిమా భారీ లాభాలు తెచ్చిపెట్టింది.

దీనితో లిటిల్ హార్ట్స్ నిర్మాత అండ్ టీం ఆ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఆదిత్య హాసన్ నుంచి నెక్స్ట్ ప్రాజెక్ట్ గా ఆనంద్ దేవరకొండతో తన దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ సినిమాకి అప్పుడే సాలిడ్ ఓటిటి డీల్ పూర్తయినట్టు తెలుస్తుంది. లేటెస్ట్ బజ్ ప్రకారం ఈ ప్రాజెక్ట్ కి ఏకంగా 11 కోట్లు ఓ ప్రముఖ సంస్థ సొంతం చేసుకున్నారట. దీనితో ఈ టాక్ సినీ సర్కిల్స్ లో మంచి వైరల్ గా చక్కర్లు కొడుతోంది.

Exit mobile version