“కిష్కింధపురి” పై చిరంజీవి వీడియో రివ్యూ వైరల్!

లేటెస్ట్ గా రిలీజ్ కి వచ్చిన చిత్రాల్లో టాలెంటెడ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా దర్శకుడు కౌశిక్ పగళ్ళపాటి తెరకెక్కించిన ఇంట్రెస్టింగ్ హారర్ థ్రిల్లర్ చిత్రం ‘కిష్కింధపురి’ కూడా ఒకటి. మరి ఈ చిత్రం మంచి టాక్ ని సొంతం చేసుకొని సాలిడ్ రన్ ని కొనసాగిస్తుంది.

ఇక ఈ సినిమాపై లేటెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి తన రివ్యూ పంచుకోవడం వైరల్ గా మారింది. కిష్కింధపురి సినిమా తనని అలరించినట్టు తెలిపారు. ఒక హారర్ సినిమాగానే కాకుండా సైకలాజికల్ గా దర్శకుడు కౌశిక్ పగళ్ళపాటి చెప్పిన పాయింట్ ఈ చిత్రంలో చాలా బాగుంది. అలాగే చైతన్ భరద్వాజ్ సంగీతంని కూడా మెచ్చుకున్నారు.

నటీనటులు బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమలు మంచి నటన కనబరిచారు అని తన నెక్స్ట్ సినిమా “శివ శంకర వరప్రసాద్ గారు” నిర్మాత సాహు గారపాటి మంచి ప్రయత్నం అందించారు అని ఈ చిత్రాన్ని తప్పకుండా ప్రతీ ఒక్కరూ థియేటర్స్ లో చూడండి అంటూ మెగాస్టార్ సూచించారు. దీనితో తన వీడియో రివ్యూ వైరల్ గా మారింది.

Exit mobile version